Saturday, January 8, 2011

కిం.. కర్తవ్యం ?

Babu
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పెట్టిన చిచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంకా రగులుతోంది. కాంగ్రెస్‌-టీడీపీ ఒకేరకమైన సమస్యతో సతమత మవుతుంటే, టీఆర్‌ఎస్‌ మరో రకమైన సమస్యతో ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి కాంగ్రెస్‌-టీడీపీలకు ప్రాణసంకటంలా మారగా, కేసీఆర్‌ మాత్రం తన భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై అనుసరించాల్సిన వ్యూహమేమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ-సీమాంధ్రలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి వైఖరి అనుసరిం చాలో తెలియక అవస్థలు పడుతోంది. ఏ ప్రాంతం వైపు మొగ్గుచూపినా మరొక ప్రాంతంలో దెబ్బ తింటా మన్న భయం వెన్నాడుతోంది.

తెలంగాణ వైపు మొగ్గుచూపినా ఆ రాజకీయ లబ్థి టీఆర్‌ఎస్‌- బీజేపీకి వెళుతుందన్న భయం కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీ నామా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు గతంలో అనుసరించిన వైఖరిని బట్టి, ఈసారి కూడా అంత సీను ఉండదని, మళ్లీ అధిష్ఠానం హెచ్చరికలతో మరోసారి అస్తస్రన్యాసం చేస్తారన్న అంచనా తెలం గాణ ప్రజల్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడుడీఎస్‌ స్వయంగా తెలంగాణ నేత అయినప్పటికీ, పార్టీ వైఖరిని ప్రకటిం చలేకపోతున్నారు. మరోవైపు పార్టీ వైఖరితో ప్రజల్లో ముఖం చూపించలేక తెలంగాణ ఎంపీలు తల్లడిల్లిపోతున్నారు. అందుకే భేటీల మీద భేటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

kcrr 

ఇక తెలంగాణ కోసం ఏర్పడిన టీ ఆర్‌ఎస్‌ మరో విచిత్ర మైన ఇరకాటంలో ఇబ్బంది పడింది. సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, చంద్రబాబు నాయుడు ఒక్కరే తెలంగాణకు అడ్డుపడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు యుపీఏ అడ్డం తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో సోనియాగాంధీని విమర్శించాలో, వద్దో అర్థం కాక సతమతమవుతున్నారు. నిజంగా సోనియాగాంధీ తెలంగాణ ఎప్పుడో ఇచ్చినట్టయితే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దానిపై చిదంబరం భేటీ, మళ్లీ ఈనెలాఖరులో చిదంబరం భేటీ ఎందుకన్న ప్రశ్నలు తెలంగాణలోని సామాన్య జనంలో మొదలు కావడం ఇబ్బంది కలిగిస్తోంది.

తన దీక్ష విరమణ సందర్భంగా డిసెంబర్‌ 9న చిదంబరం చేయవలసిన ప్రకటనను తానే నిర్దేశించానని సగర్వంగా చెప్పు కున్న కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయించలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రతర్థి వర్గాలు నిలదీస్తుండటం ఆ పార్టీకి ఇరకా టంగా పరిణమించింది. బహుశా ఇలాంటి ఇరకాటం తోనే కేసీఆర్‌ జోరు తగ్గించారని, పార్లమెంటు సమావేశాల వరకూ గడువు ఇచ్చి, ఆ లోగా జరిగే పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌ సోనియాగాంధీని విమ ర్శించకపోవడం కూడా చర్చనీయాంశమయింది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ఆయన సోనియాను విమర్శించడం లేదని, కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

D.-Sriniva 

అందుకే గత డిసెంబర్‌ ముందున్న స్పీడు, జోరు ఆయనలో కనిపించడం లేదంటున్నారు.అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తెలంగాణపై సంకట స్థితినే ఎదుర్కొంటు న్నారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయా లన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గతంలో శ్రీ కృష్ణ కమిటీపై పెదవి విప్పకుండా రెండు ప్రాంతాల నేతలతోనే మాట్లాడించిన బాబు, ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకునే అవసరం ఉన్నందున, తెలంగాణ నేతల స్వేచ్ఛకు అడ్డు రాకుం డానే అటు పార్టీని, ఇటు రెండు ప్రాంతాల నాయకుల ను కాపాడుకోవటం సవాలుగా పరిణమించింది.

ఇటీవల చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా తెలంగాణ విద్యార్థి జేఏసీలు, ఉద్యమ సంఘాల వ్యతిరేకత తగ్గించుకున్న బాబు, ఈనెలాఖరులో మళ్లీ ఢిల్లీలో జరిగే భేటీకి హాజరుకా వాలా వద్దా అన్న అంశంపై తర్జనభర్జన పడుతు న్నారు. సోనియా ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, తానే అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్‌ ఇప్పటివరకూ చేసిన ఆరోపణలో నిజం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమయినందున, ఆ తర్వాత పరిణామాలు తమ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయోనని వేచిచూస్తున్నారు. ఈలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ముద్దాయిగా నిలబెట్టా లన్న వ్యూహం అనుసరిస్తున్నారు.

Saturday, January 1, 2011

2011 నే ‘తల’ రాతలు * సవాళ్ల మధ్య సబలలు

రాజైనా.. .పేదైనా.. .పండితుడైనా ...పామరుడైనా...కార్మికుడైనా ...కర్షకుడైనా ...ఏరంగం వారికైనా గడిచిన సంవత్సరం...రాబోయే సంవత్సరం సాధించిన మంచి చెడులను విశ్లేషించుకునేది ఈ రోజే...అనుకున్నవి జరగక రాబోయేది మంచి కాలమని ఆశావహులు భావిస్తే.... తమకెంతో మేలు జరిగిన ఈ సంవత్సరాన్ని ఎన్నటికీ మరువలేని తీపిగుర్తుగా తమ హృదయడైరీలలో భద్రంగా రాసుకునే వారు మరికొందరు...రాజకీయరంగంలో మహిళలు తక్కువమందే ఉన్నా మన రాష్ట్రానికి సంబంధించి మహిళా ప్రజాప్రతినిధులలో కొందరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండగా మరికొందరు రాష్ట్ర రాజకీయాలలో మంత్రులుగా కీలక బాధ్యతలను నెరవేరుస్తున్నారు. వారి వారి రాశులు, నక్షత్రాలు ఆధారంగా రాబోయే కొత్త సంవత్సరంలో వారి జాతకఫలాలు ఎలా ఉన్నాయో విశ్లేషిస్తూ...మంత్రులుగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ మహిళా మంత్రులకు ధీర కొత్త ఏడాది శుభాకాంక్షలు...అందిస్తోంది...

కలిసి సాగాలి
సబితా ఇంద్రారెడ్డి, జననం: 5 మే 1963
కన్యారాశి, హస్త నక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు
PSabita
వ్యక్తిత్వంలో కన్పించని అపార సహనం, అంకితం, విశ్వాసం ఉంటాయి. ద్వంద్వ వ్యక్తిత్వం. మనస్సులోని భావాలను బయడపడనీయరు. అలా బయటపెడితే, తాము తక్కువ అంచనాకు గురవుతామేమోనని భయపడుతుంటారు. అది మరో రూపంలో లేదా కొంత కాలం తరువాతనైనా బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వారిని అర్థం చేసుకునేందుకు మరెంతో సహనం అవసరం. వీరు ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చి పని చేయడం ఆరంభిస్తారు. నిర్ణయ శక్తి బలహీనం. తమ అభిప్రాయాలను సమర్థించు కుంటూ ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఒత్తిళ్ళలో కన్నా క్లిష్టపరి స్థితుల్లో వీరికి మరెవరికీ లేనంత పోటీతత్వం, తిరుగుబాటు లక్షణాలు కలిగి వుంటారు. అలాంటప్పుడు దృఢసంకల్పం, దీర్ఘకాలిక పోరాట శక్తి కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు ఆలోచనళ్లో సరళత్వాన్ని పెంచుకుంటూ, ముందు గానే అభిప్రాయాలకు కట్టుబడకుండా ఉండాలి.

ఎదుటి వారు చెప్పేది తాను వినడం, తాను చెప్పేది ఎదుటి వారు వినడం అనే తరహాలో కాకుండా ఇంటరా క్టివ్‌ స్వభావాన్ని పెంచుకోవాలి. తద్వారా జాతకులు పబ్లిక్‌ స్పీకర్స్‌ కాగలరు. అంతర్గతంగా ఉండే వివిధ భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. 2011 ఊహించుకున్నంత భయంకరంగా ఏమీ ఉండదు. ఆమె పాత్ర చాలా కీలకం అవుతుందన్న ఆందోళన చెందనక్కర్లేదు. అందువల్ల కాస్తంత ధైర్యంగా ఉండ డం అలవాటు చేసుకుంటే మంచిది.
వైఫల్యాలో వైరాగ్యం
గల్లా అరుణ, జననం: 20సెప్టెంబర్‌ 1943
వృషభ రాశి, రోహిణి నక్షత్రం
g-aruna
ఇతరుల నుంచి తనకు ఏమీ కావాలో ఆమెకు తెలుసు. అందుకు అనుగుణంగానే పని చేస్తుంటారు. వనరులను గుర్తించడం, వాటిని అందరికీ ఉపయోగపడేలా చూడడంలో (స్వామికార్యం, స్వకార్యం) ఎంతో పరిపక్వత ఉంటుంది. పైకి కన్పించకపోయినా, ఆచరణలో మాత్రం తనను నమ్ముకున్న వారికి సహాయం చేసితీరుతారు. ఆ సహాయం పొందిన వారికి అది ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆమె రాజకీయ నేతగా గాకుండా మానవత్వంతో ఆలోచిస్తారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అభిప్రాయాలను మార్పు చేసుకుంటూ వుంటారు. ఇతరులు వంచించేందుకు ప్రయత్నించేప్పుడు ఆ విషయాన్ని గుర్తిస్తూ, వాటినుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తారు. ఇది పోరాట, సాహస లేమికి నిదర్శనమైనప్పటికీ, ఆమెలో ఉండే తెలివితేటలకు ప్రతీక కూడ. భావోద్వేగపరంగా అస్థిరతతో వ్యవహరిస్తారు. చుట్టుపక్కల పరిస్థితులకు తేలిగ్గా లొంగిపోతారు.

తరచూ కోపం, అసహనం ఆమె తీసుకున్న నిర్ణయాల్లో కన్పిస్తుంది. బయటకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, భావోద్వేగాల తీవ్రత అధికం. క్లిష్టపరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఆ సమయంలో జ్యోతిష్యులను లేదా గురువులను ఆశ్రయిస్తారు. వైఫల్యాలు ఎదురైతే, మనం ఏం చేసినా అంతా దైవాధీనం అనే ఆధ్యాత్మిక ధోరణితో ఉంటారు. సేవా భావం అధికం. 2011లో ఈ తరహా భారీ కార్యక్రమాన్ని చేపడితే పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు రాజకీయ భవిష్యత్తుకూ తోడ్పడుతుంది.
అపార్థాలకు తావెక్కువ
డి.కె.అరుణ, జననం:4 మే 1960
కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, బుధుడు ఆధిపత్యం
DK-Aruna
జీవితంలో భావస్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, సౌకర్యాలను కోరుకుంటారు. తన పనిలో మరొకరి జోక్యం, ప్రమేయం, ఒత్తిళ్లు లాంటి వాటిని ‚సహించలేరు. నిర్ణయాలకు కారణాలను ఎదుటివారికి సుదీర్ఘంగా చెప్పేందుకు ఇష్టపడరు. ఓ పనిపై ఆమె అభిప్రాయాల్లో అది ఆమెకు ఇష్టమో, కాదో బయటపడుతుంది. ఓ పని చేయడం ఆమెకు ఇష్టం లేని సమయంలో, ఆ పని చేస్తే బాగుంటుందంటూ మరెవరైనా సుదీర్ఘంగా వివరణలు ఇస్తుంటే, వాటికి ప్రతిగా ఆమె రకరకాల కారణాలు వివరిస్తారు. దీంతో తాను ఇతరులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణి అందులో కన్పిస్తుంది. ఈ కారణంగా ఆమెను అభిమానించే వారి సంఖ్య కన్నా, ఇష్టపడని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆమె జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. అలంకరణలో కన్పించే ఆడంబరం ఆమె జీవనశైలిలో కన్పించదు. తనకు తెలియకుండానే తనలో ఉండే, కొత్తొక వింత, పాత ఒక రోత అనే లక్షణం ఆమె స్నేహి తులు ఆమెను అపార్థం చేసుకునేలా ఉంటుంది.

భావోద్వేగాల పరంగా ఆమె త్వరగా స్పందిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఇతరుల సమస్యలకు పరిష్కారం చెప్పడం లేదా ఆ సమస్యలో తలదూర్చడం చేస్తే స్వీయనియంత్రణ కోల్పోతారు. ఆ ప్రక్రియలో ఎదుటి వారిని శాసిస్తారు. సలహా ఇచ్చి, పాటించడంలో స్వేచ్ఛ అవతలివారికే ఇవ్వాలి. అలాంటప్పుడే అనుచరుల మద్దతు పెంచుకోగలుగుతారు.
ఆత్మన్యూనత ఎక్కువ
సునీతా లకా్ష్మరెడ్డి, జననం: 5 ఏప్రిల్‌ 1968
మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి రాహువు.
sunitha
ఆశయాలు అధికం. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే తపన ఎక్కువ. అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేస్తుంటారు. కఠోర పరిశ్రమ, తెలివితేటలతో మాత్రమే ఆ స్థాయిని చేరుకోవాలని అనుకుంటారు. అలా గాకుండా ఎదుటివారి దయాదాక్షిణ్యాలతో ఆ స్థాయిని చేరుకోవాలని మాత్రం ఆకాంక్షించరు. అలాంటి పరిస్థితి వస్తే అంతర్ముఖం. పోటీతత్వం అధికం. ఒక పని కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అత్యధిక స్థాయిలో అన్వేషిస్తారు. అనుకున్నది సాధించడంలో ఆమెకు ఉన్న తాపత్రయం, అందుకు చేసే ప్రయత్నాలు అవతలి వారి దృష్టిని ఆకర్షిస్తాయి. స్వీయ గుర్తింపు అనేది క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఇది బుద్ధిబలంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. కనిపించని పక్షపాతం ఉంటుంది. వైఫలాల్యను అంగీకరించరు. ఆ పని చేయడాన్నే వదిలేస్తారు. ఆత్మన్యూనత, భయం ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో మిగతా వారి నుంచి భావోద్వేగ మద్దతు లేకుండా సమన్వయం చేసుకోలేరు.

తనను తాను మోటివేట్‌ చేసుకోవాల్సి వస్తే పరిస్థితులకు అనుగుణంగా అని గాకుండా తన అవసరాలను బట్టి చేసుకుంటారు. మొదట్లో కన్పించిన వ్యక్తిత్వం కాలానుగుణంగా సన్నగిల్లుతుంది. కారణం, తనకు పనికొచ్చేలా వనరులను వెదుక్కోవడం, ఆధిపత్యాన్ని కోరు కోవడం. ఎదుటివారి కోణంలో ఆలోచించి పరిష్కరించగల నైపుణ్యం ఉన్నప్పటికీ, వారు తన మాట వినకుంటే మాత్రం అసహనం. పరిస్థితులు, మనుష్యూలు...లాంటివాటిని ఏకపక్షంగా పరిశీలించడంతో వయస్సుకు మించిన అనుభవాన్ని పొందినట్లు అవుతుంది. ఆ అనుభవం ఉన్నప్పటికీ, వ్యవస్థను మేనేజ్‌ చేయలేక, అంత ర్ముఖం అవుతూ ఆధ్యాత్మిక ధోరణిలో పడిపోతారు. 2011లో వీరి మాటకు, ఆలోచనలకు, సామాజిక, రాజకీయ బాధ్యతలకు మంచి గుర్తింపు వస్తుంది. ఆమె అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది.
ఆచరణలో ఆవేశం పూజ్యం
పనబాక లక్ష్మీ, జననం: 6 అక్టోబర్‌ 1958
మిథున రాశి
Panabaka-Lakshmi
బాధ్యతలు స్వీకరించడంలోనూ అపార నిజాయితి. ఒక అంశాన్ని భిన్న కోణాల్లో పరిశీలించడం, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆ పనిపై మానసిక శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించడం ప్రధాన బలాలు. చక్కటి సలహాదారు. ఎదుటి వారు శత్రువా, మిత్రువా అని చూడకుండా సందర్భానికి తగ్గ సలహాలు ఇవ్వగలరు. వారు ఆ సలహాను ఆచరించకపోయినా పట్టించుకోరు. మూడీగా ఉండడం, చొరవ తక్కువ, తీసుకునే నిర్ణయాల్లో ఇతరుల అభిప్రాయాల సేకరణ బలహీనతలుగా చెప్పవచ్చు. ఒక పనిని పూర్తి చేయడంపై మాటల్లో, భావోద్వేగాల్లో ఉన్న ఆవేశం ఆచరణలో అంతగా కన్పించకపోవచ్చు. ఇతరుల సహాయం లభించక పోవడం అందుకు కారణాలుగా చెబుతారు. హైపర్‌ సెన్సిటివ్‌. నలుగురిలో కలివిడి తక్కువే. అందరిలో తేలిగ్గా కలసిపోలేరు. దీనివల్ల ఎదుటివారిని మేనేజ్‌ చేస్తున్నట్లుగా ఉంటారే తప్ప వారితో కలసిపోయినట్లుగా ఉండరు. ఒక వ్యవస్థలో ఉంటూ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తారు. ఆత్మవిశ్వాసం తక్కువ. భావోద్వేగపరంగా డిస్టర్బ్‌ అవుతామేమోనన్న భయం, ఇతరులు మోసగిస్తారే మోనన్న ఆందోళన ఉంటాయి.

ఇలాంటివి ఇప్పటికే జరిగిఉంటే, ఇతరులను చుల కన చేసే అవకాశం ఉంది. ఇది ఆశయసాధనలో ఆమెను ఓ పెద్ద సముద్రంలోకి తీసుకెళ్ళకుండా ఓ చిన్న బావికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఊహించిన అవకాశాలు వచ్చినప్పుడు, ఆ హోదాలో చేరకముందే, అందుకు తగ్గ బలాలను ఇతరుల నుంచి ఆశిస్తుంటారు. అందుకు గాను ఎప్పుడూ ఇతరులను వదులుకోలేరు. తమను తాము నమ్ముకోలేరు. దీనివల్ల వీరిలో పాలనానైపుణ్యాలు తగ్గిపోతాయి. క్లిష్టపరిస్థితుల్లో చొరవ తీసుకునే లక్షణాలు తగ్గుతాయి. ఇతరులకు మద్దతుగా నిలవడం తప్ప మరేమీ చేయలేదు. సొంత వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే రాజకీయాల్లో రాణించగలరు. 2011 వీరికి శ్రమ అధికం. అధిష్ఠానం నుంచి అవకాశాలు వస్తాయి. గతంలో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా కలసివస్తుంది.
ప్రతికూలతలో లౌక్యం
పురంధేశ్వరి, జననం : 22 ఏప్రిల్‌, 1959
కన్యారాశి
D_Purandareswari
చిత్త నక్షత్రం. నక్షత్రాధిపతి కుజుడు. చేసే పనిపట్ల మక్కువ కలిగిఉంటారు. స్వాప్నికురాలు. కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. చేసేపనిలో ముందుచూపు ఉంటుంది. దీంతో ప్రతి విషయాన్ని ముందుగానే ఊహించి దాన్ని నమ్ము తారు తప్ప కళ్ళముందు కన్పించే దాన్ని విశ్వసించరు. జ్యోతిష్కూలకు, మానసిక నిపుణు లకు ఉండే లక్షణం ఇది. ఏం జరుగబోతుందో అన్న విషయమై ముందుగానే సమాచారం సేకరించగలుగుతారు. ఊహించ గలుగుతారు. ఏదైనా విషయంలో మొదట్లో ఆమెను విశ్వసించని వారు సైతం ఆమె చెప్పేవి నిజాలు కావడంతో ఆమెను అనుసరిస్తారు. అనుకున్న దాన్ని సాధించుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ క్రమంలో వీరు తాము అనుకున్నది సాధించుకోవడంలో, అది ఎవరి వల్ల అవుతుందో కచ్చితంగా గుర్తించగలరు. తన ఆలోచనలకు అనుగుణంగా ఎవరిని ఉపయోగించుకోవచ్చో గుర్తిస్తారు. సహాయం చేసిన వారి పట్ల విధేయత, అంకితభావం ప్రదర్శిస్తారు. ఓ పని తలపెట్టినప్పు డు అవతలి వారితో వేగంగా భావోద్వేగాలు పంచుకోవడం, వారి దృష్టికోణంతో ఆలోచించడం చేస్తూ, వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక కొంత అయోమయానికి గురికావడం చోటు చేసు కుంటుంది. వ్యక్తులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఆమె సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తే తప్ప బయట పడరు. అంతర్ముఖం. మనస్సులో మాట అంత తేలిగ్గా బయటపెట్టరు. ఒక విషయాన్ని రకరకాలుగా ఆలోచించి ఎటూ తేల్చుకోలేనటు వంటి సందిగ్ధంలో పడిపోతారు. కార ణం జాప్యాన్ని, వాయిదాను తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి దృష్టిని మళ్ళించుకుంటారు. సహనాన్ని బాగా పరీక్షిస్తే, తన అభిప్రాయాలను, భావాలను మార్చుకునేందుకు వెనుదీయరు. అలాంటప్పుడు గతాన్ని, అవతలి వారితో తనకు గల స్నేహసంబం ధాలను పట్టించుకోరు. 2011లో పార్టీలో ఇతర మహిళా నాయకులకు ఆమె ఆదర్శం కాగలుగుతారు. ఆమె కీలకపాత్ర వహిస్తారు. రాజకీయ పరిపక్వతను చాటుకుంటారు. బాధ్యతల పరంగా ఒత్తిళ్ళు పెరిగే అవకాశం ఉంది.
ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌

2011 నే ‘తల’ రాతలు

నేను మారానంటే నమ్మరే.. !
newsofap 

(వృషభరాశి20 ఏప్రిల్‌ 1950)గోచారరీత్యా వృషభరాశిలో జన్మించిన చంద్ర బాబునాయుడు గురువుయొక్క స్థానం మీన రాశి నుంచి కర్కాటక రాశిపై పంచమదృష్టి కలిగి ఉం డడం వల్ల చంద్రలగ్నాత్‌, ఈ జాతకుడికి ఈ సంవ త్సరం జనవరి నుంచి జులై వరకూ ఎంతో బాగుం టుంది. డైనమిజాన్ని వృద్ధి చేసుకుంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తాయి. ఐడియలిస్ట్‌ పర్సనా లిటీ ఇంప్రూవ్‌ చేసుకునేందుకు ఈ సంవత్స రం మొదటి అర్థభాగం ఉపయోగ పడుతుంది.సున్నిత భావా లపై స్పందించడం, మీడియాకు ఎక్కువగా రావడం..., నలుగురిలో కలసి పోవడం, తప్పులు పసిగట్టడం,ఎదురుదాడికి దిగడం లాంటి లక్షణాలు పెంపొందించుకుంటారు. రెబల్‌ పర్సనాలిటీగా మారుతారు.

ఈ సంకేతం ద్వారా తన చుట్టుపక్కల వారికి, ఆంతరంగికులకు, ప్రజలకు మార్పు చూపిం చేందుకు, వారి నమ్మకాన్ని గెలుచుకునేందుకు సర్వప్రయత్నాలు చేస్తారు. అందులో చాలావరకు విజయం సాధిస్తారు. అదే సమయంలో, సామాజిక, రాకీయ, ఆర్థిక వ్యవస్థలలో మార్పు నకై పోరాటం చేస్తారు. ప్రజల ఆర్థిక స్థితిగతులపై బాగా దృష్టి పెడుతారు. ఆయన లాజికల్‌ వ్యూస్‌ను చాలావరకు అంతా ప్రశంసిస్తారు. అది ప్రభుత్వంపై ఒత్తిళ్ళను పెం చుతుంది. ఈ ప్రయత్నంలో చాలా మంది సానుభూతిని చంద్రబాబు పొందు తారు. ఈ ప్రవర్తన వల్ల ఆంతరంగికులు కూడా పునరాలోచనలో పడు తారు. ఆయనలోని నాయకత్వ లక్ష ణాలను కొత్తరకం గా చూసే స్థాయిలో చంద్రబాబు వారిని ప్రభావితం చేయగలుగుతారు. చంద్రబాబు టీమ్‌ వర్కర్‌ కాదని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పని నిరూ పించేలా చంద్రబాబు టీమ్‌ వర్క్‌ ఉంటుంది.

gakhtaసంవత్సరాదిలో చేసిన ప్రయత్నాలన్నీ అప్పటి పరిస్థితులపై సగటు మనిషి దృష్టిని ఆకట్టుకోవ డంలో విజయం సాధించినప్పటికీ, సంవత్సరం రెండో అర్థభాగంలో మాత్రం అప్పుడు చోటు చేసు కునే సామాజిక, రాజకీయ పరిణామాలను బ్యాలెన్స్‌ చేయ డంలో ఒత్తిళ్ళకు లోనవుతారు. ఈ ఒత్తిళ్ళ నేపథ్యంలో తన ఒరిజినల్‌ నేచర్‌ (నేను, నాది, నేనే)కు వచ్చేస్తారు. దీన్నంతా బ్యాలెన్స్‌ చేయలేక తనకు తెలియ కుండానే తనపై, తన ధోరణిపై ఇతరుల్లో అయోమయాన్ని కలిగిస్తారు. తన ఇమేజ్‌కు తానే చేటు తెచ్చుకుం టారు. రెండో అర్థవార్షికం ఆయన పొలిటికల్‌ కెరీర్‌ను ఓ చౌరస్తాలో నిలబెడుతుంది.

babu-health 

ఈ మొత్తం ప్రక్రియలో ఆయన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎదగనీయడంలేద నే భావన కలుగు తుంది. వ్యూహం అనేది లేకుండా దాడికి దిగడం చేస్తుంటారు. కొంత నిరాశకు గురికావడం, బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసు కున్న నిర్ణయా లు అచ్చిరాకపోవడం వంటివి ఉంటాయి. సక్సెస్‌ కంటే ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. తాను అనుకున్న వాటిని ఆచరణలో పెట్టే సమయంలో మాత్రం వ్యక్తిత్వపు లోపాలు ఆయనను తిరిగి పూర్వస్థాయికి తీసుకు వస్తాయి. ఇందుకు కారణం, చంద్రలగ్నాత్‌, పంచమ స్థానమైనటువంటి కన్యరాశిలో ఉన్న శని అని చెప్పవచ్చు. జాతకుడు మానసిక భావోద్వేగాల పరంగా కూడా పరిపక్వత సాధించాలి. లేనిపక్షంలో ఎదుటివారి తప్పులెంచుతూ, ఎదురు దాడి చేస్తూ విపక్షంలోనే కొనసాగాల్సి వస్తుంది.

మైండ్‌సెట్‌
ఈ రాశిలో పుట్టిన వారికి క్రిటికల్‌ మూమెంట్స్‌లో ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం లో ఎంతగా సక్సెస్‌ అవుతారో, సాధారణ సమయాల్లో వారి దృష్టిని ఆకట్టు కోవడంలో మాత్రం అంతగా విజయం సాధించ లేకపోతారు. వీరికి రేషనాలిటీ ఉండదు. దృక్పథం తక్కువ. అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రయత్నిస్తూ, చేసిన వాగ్దా నాలను, బాధ్యతలను మర్చిపోతుంటారు. తప్పు లు గుర్తించడం, ఎన్వి రాన్‌మెంట్‌ను రెచ్చగొట్టడం లాంటి వాటికి ఎంతగా చేస్తారో, వ్యవస్థలో తప్పులను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచించ డంలో అంతగా శక్తి వెచ్చించరు.

ఎదుటి వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యూహాల్లో, ఆలోచనలు విలువలు తక్కువగా ఉంటాయి.ఈ ప్రక్రియలో తీవ్రమైన దూషణ లకు అలవాటు పడుతారు. దీనికి పరిష్కారం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో వడం తగ్గించుకోవాలి. వ్యూహాలు, ఆలోచనలు, పథకాలు లాంటివాటిని నిశితం గా పరిశీలిస్తే, వాటిల్లో తిరిగి కపటమే కన్పిస్తుంటుంది. అదే సమయంలో, వీరు తమ అనుచరులను కూడా అదే విధంగా ప్రభావితం చేస్తారు. వారి నుంచి వచ్చే సలహా ల్లో తమకు నచ్చే వాటినే స్వీకరిస్తారు. నిర్మాణాత్మక విమర్శలనూ భరించ లేరు. ఈ ధోరణితోనే రెండో అర్థవార్షికంలో ప్రజలకు ‘బోరింగ్‌ పర్సనాలిటీ’గా మారే అవకాశం ఉంది.

గ్రహబలం
గోచారరీత్యా మారుతున్న గ్రహస్థితులు వృషభరాశిలో జన్మించిన చంద్రబాబు నాయుడికి క్లిష్టపరిస్థితులను కలిగిస్తాయి. చంద్రలగ్నాత్‌, జాతకరీత్యా నాయక త్వపు లక్షణాలను, పోటీ తత్వాన్ని పెంపొందించే కుజుడి స్థానం శత్రుస్థానాలతో సాంగత్యం చేస్తున్నది. అది నాయకుడిగా ఆయన ఎదుగుదలను అడ్డు కుంటుంది. ఆగస్టు నుంచి కుజుడు బలహీన పడడం ప్రతికూల వాతావరణానికి అవకాశం కల్పిస్తుంది. శుక్ర, బుధ స్థానాలు కూడా ప్రేక్షక పాత్ర వహించడానికి కారణాల వుతాయి. పబ్లిక్‌ అట్రాక్షన్‌, గ్లామర్‌ లాంటి వాటికి అధిపతి అయిన శుక్రుడు శత్రుసాంగత్యం చేయడం వల్ల జాతకుడు సుస్థిరత, టెంపర్‌మెంట్‌ కోల్పోతారు. బుద్ధి బలానికి అధిప తి అయినటువంటి బుధుడు కొంత అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని, తాను అనుకున్న వ్యూహానికి కట్టుబడి ఉండగలగుతారు.

కొత్త బాటలో.. కొత్త గొంతుకతో...!
y-s-jagan-mohan 

(21 డిసెంబర్‌ 1972 మిథునరాశి)జగన్‌ ప్రాథమికంగా స్వేచ్ఛాప్రియుడు. సొంతంగా ప్రణాళికలు, వ్యూహాలు రూ పొం దించుకోవడంలో మాత్రం బలహీనం. చాలావరకు తక్షణ స్పందనలే అధికం. భావాల వ్యక్తీకరణలో ధైర్య,సాహసాలు అధికం. చాతుర్యం ఉండదు. వ్యూహాత్మకంగా వ్యవహరించలేరు. వైఫల్యా లను ఆధ్యాత్మికంగా స్వీకరిస్తారు. ఆచరణాత్మక ధోరణి ఉండదు. ఈ ధోరణి వ్యవస్థను ప్రశ్నించేలా చేస్తుం ది. అది ఇతరులను ఆలోచనల్లో పడేస్తుంది. అంకిత భావం ఉండే స్వభావం. అవతలి వారి నుంచి కూడా దాన్ని తాను ఆశిస్తున్నానన్న సంకేతం ఉంటుంది. నమ్మితే సొంత మనుషులుగా భావిస్తారు. మాటల తో చెప్పకుండానే అవతలి వారి నుంచి తాను ఏది ఆశిస్తున్నదీ సూచనప్రాయంగా వెల్లడిస్తారు. ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు.

వారికి అంత స్వాతంత్య్రం ఇవ్వరు. ఇతరులతో వ్యవహారాల్లో ప్రయోజనాన్ని ఆకాక్షించే భావోద్వేగాలను కలిగిఉంటారు. నమ్మితే అది చివరి వరకూ ఉంటుంది. స్వతంత్ర భావాలు, వ్యూహాలు, తర్కం, వినూత్నం, చివరి వరకూ ఓటమిని అంగీకరించని తత్వం...ఇవన్నీ ఉన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. ఇతరుల సలహాలు ఆయన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది దీర్ఘకాలంలో ఆయనకు మేలు చేస్తుంది. ఏ పని చేసి నా అది అవతలి వారి దృష్టిని ఆకర్షించేందుకు అని గాకుండా కమిట్‌మెంట్‌తో చేస్తారు. ఇన్నర్‌ డిగ్నిటీ అనేది ప్రవర్తనలో కనబడదు గానీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేసేటప్పుడు అది బయటపడుతుంది. అది ఇతరుల్లో ఆయనపై భయభక్తులను పెంచుతుంది. జగన్‌లో చిన్నపిల్లాడి మనస్తత్వం కూడా ఉంటుంది. ఎప్పుడూ చీకటిని గాకుండా వెలుగును చూస్తుంటారు.

మంచిచెడుల అన్వేషణ చేస్తుం టారు. డూ వాట్‌ ఈజ్‌ రైట్‌ , డోంట్‌ థింక్‌ హూ ఈజ్‌ రైట్‌ అనేది ఆయన తత్వం. ఇదే అనుచరుల్లో ఉంటే హర్షిస్తారు. ఎప్పుడైనా మాట జారినా కూడా అనుచరులు దూరం గాకుండా ఈ లక్షణం కాపాడుతుం ది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కన్నా కూడా ఎక్కువగా వినూత్నం, ప్రోగ్రెసివ్‌కు ఇష్టపడుతారు. ఇతరుల సూచనలను ఇష్టపడుతారు. సమస్య చిన్నదో, పెద్దదో అని చూడకుండా అకస్మాత్తుగా భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతారు. అలాంటి సందర్భాల్లో అవతలివారితో డిస్‌కనెక్ట్‌ అయిపోతారు. ఆశయాలు, ఆకాంక్షలు అనంతం. వాటిపైనే ఫోకస్‌. ఇది ఇతరులకు అత్యాశ, అపరి మిత ఆసక్తి అన్పిస్తుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌, పర్‌ఫెక్షనిజం ఈ రెండు కనబడని బలాలుగా ఉంటాయి. చేసే పనుల్లో ఈ లక్షణాలు కన్పిస్తుంటాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఆయన ఫిలాసఫీ మైండ్‌ ఆయనను అనుభవంతో పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. తొందరగా మాస్‌ పీపుల్‌ను అట్రాక్ట్‌ చేస్తుంది ఈ లక్షణం.

మైండ్‌సెట్‌
సృజనాత్మక ఆలోచనలపై దృష్టి సారించడంలో అమిత ఉత్సాహం. చొరవ తీసుకోవడంలో అద్భుత శక్తి. అందివచ్చిన అవకాశాలను సొంతం చేసు కుం టారు. అనుభవంతో వచ్చే ఊహాశక్తి, సాహసోపేత స్వభావం ఆయన ప్రాథ మిక బలాలు. ప్రతికూల వాతావరణాన్ని ముందుగానే పసిగట్టగలరు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగిపోరు. భయపడి పారిపోరు. ఆత్మవిశ్వాసంలో, కష్టాలను అధిగమించడంలో మేటి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆయనలోని శక్తులు వెలుగుచూస్తాయి. ఈ ధోరణి ఆయన చుట్టుపక్కల వాతావరణానికి, వ్యక్తులకు స్ఫూర్తిని ఇస్తుంది.

అట్టడుగు వర్గాల మేలుకోసం పని చేసేందుకు తొందరగా చొరవ తీసుకుంటారు. వ్యక్తుల గుణగణాలను విశ్లేషించడంలో మేటి. క్రాస్‌చెక్‌ చేయకుండా నిర్ణయం తీసుకోరు. కొన్ని కీలక అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ సమ యం తీసుకున్నా, తీసుకున్నంత మాత్రాన ఆ కాల వ్యవధి అనుత్పాదకతగా ఉండదు. ఆ విషయాన్ని ప రిశీలించేందుకే ఆ సమయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఆ టైమ్‌గ్యాప్‌ను కవర్‌ చేస్తారు. వైఫల్యాలను అంత తేలిగ్గా అంగీకరి ంచరు. మనస్సాక్షిని నమ్ముతారు.

ఇలాంటి వారికి బేసికల్‌గా చుట్టుపక్కల వ్యవస్థ నుంచి మంచి పేరు రాదు. నమ్మిన వారికి మాత్రం దేవుడే. ఆయన ధోర ణి క్రమశిక్షణారాహిత్యంగా కన్పిస్తుంది. సెల్ఫ్‌సెంటర్డ్‌గా,అవకాశవాదిగా, స్వేచ్ఛావాదిగా కన్పిస్తారు. విజ న్‌ లేదు, ఇంకా మానసికంగా ఎదగలేదు అని ఇతరులు బురద చల్లేందుకు ఈ ధోరణి అవకాశం కన్పిస్తుంది. ఆయనకు అటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఉండడం అవసరం. ఎవరితోనూ సుదీర్ఘ సంభాషణలు మం చివి కావు. అందులోనుంచి భవిష్యత్‌ ప్రణాళిలు బయటపడవచ్చు. అమాయకత్వం, ముక్కుసూటి తత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.

భావోద్వేగాలు
ప్రతీ చిన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుంటారు, అప్పటికప్పుడు వ్యక్తపర్చకపోయినా. ఎప్పుడో ఒకసారి అది బ్లాస్ట్‌ అవుతుంది. పరిణామాలను ముందుగానే ఊహించి, వాటికి పరిష్కారాలను అందించేందుకు ఇష్టపడుతారు. అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఆయన బలమైనప్పటికీ, అది ఇతరులకు మరో కోణంలో కన్పిస్తుంది. ఆయన వ్యవహార శైలిలో పరిపక్వత, డిప్లమసీ లోపించినట్లుగా అన్పిస్తుంది. విమర్శలపై వివరణ ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే సుదీర్ఘ వివరణలు ఇస్తారు. ఆ వివరణ, ధోరణి ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తుంది.

ఒక నాయకుడికి ఉండే భావోద్వేగాల కన్నా కూడా బిజినెస్‌మ్యాన్‌కు ఉండే భావోద్వేగాలు అధికం. స్వేచ్ఛ ఇచ్చి క్రమశిక్షణను ఆశిస్తారు. అందులో అపారమైన అవకాశాలు ఇస్తా రు. లాభాన్ని, ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందులో పరిపక్వతతో, ఆచరణాత్మకంగా ఉంటారు. తనపై పూర్తిగా ఆధార పడి ఉండే భావోద్వేగాలను ఇష్టపడరు. అవి తప్పనిసరి అయితే, వ్యూహాత్మకంగా, ఆదా వచ్చేలా ప్లాన్‌ చేస్తారు. తొందరగా అసహనానికి గురై అవతలి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. భావోద్వేగాల్లో ప్రేమకు, క్రమశిక్షణకు పెద్దగా తేడా ఉండదు.

గ్రహబలం
జాతకరీత్యా మిథున రాశి...చంద్రలగ్నాత్‌ సప్తమ స్థానమైనటువంటి ధనుర్‌రాశి అధిపతి గురువు స్వక్షేత్రంలో ఆత్మకారకుడైనవంటి రవితో కలసి ఉండడం వల్ల, చంద్రగురువులు సమసప్తమంలో ఉండడం, గజకేసరి యోగం ప్రభా వం కలిగి ఉండడం వల్ల పేరుప్రఖ్యాతులు ఉంటాయి. ఈ ఏడాది ఆరంభదశలో వ్యవస్థను ప్రభావితం చేస్తూ కొత్త దిశగా నడిపించడంలో పునాది పడుతుంది. తన ఆలోచనలు, వ్యూహాలు జాతీయస్థాయిలో కూ డా సంచలనం కలిగించే రీతిలో గ్రహస్థితి అనుకూలిస్తుంది.

లగ్న చతుర్ధాధిపతి అయిన బుధుడు, పంచమవ్యయాధిపతి అయిన శుక్రుడితో వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. నాయకత్వ లక్షణాలకు, పోటీ తత్వానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాలు, చేసే పనిలో ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారు. అనుచరులు, సహచరులు అధికమవుతారు. కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు మాటల వెనుక భావాలు వ్యవస్థను నిర్మాణాత్మకరీతిలో ప్రభావితం చేస్తాయి. చంద్రలగ్నాత్‌ అష్టమ భాగ్యాధిపతి అయిన శని వ్యయం (వృషభరాశి)లో, మిత్రస్థానంలో ఉండడం వల్ల మహిళల సానుభూతి అధికంగా ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ద్వితీయార్థంలో జాతీయ స్థాయిలో గుర్తింపు బాగా ఉంటుంది.

రాజకీయ గ్లామర్‌ కావాలి !
Chiranjeevi 

(22 ఆగస్టు 1959 కన్యారాశి)చిరంజీవి ఇతర అంశాలు వేటితో నిమిత్తం లేకుండా గ్లామర్‌ పొందుతారు. పాలిటిక్స్‌ నుంచి కాకుండా సినిమాల ద్వారా ఈ గ్లామర్‌ సాధించగ లుగుతారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొని లైమ్‌లైట్‌లోకి రావడానికి సకల ప్రయత్నాలు చేస్తా రు. సెప్టెంబర్‌ వరకు పొలిటికల్‌గా ఆయన ధోరణి అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం కలిగించేదిలా ఉంటుంది. గత అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే స్వభావం అధికం. ప్రతి చిన్న విషయానికి ఆత్మపరిశీలన అధికం. పార్టీలో, ఆంతరంగికుల్లో వచ్చే మార్పులకు తనను తాను బాధ్యుడిని చేసుకుంటూ వాటిని మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత లను విస్మరిస్తారు. ఎక్కువగా ఆత్మపరి శీలన చేసుకోవడం ఆయనలో బుద్ధిబలాన్ని సన్నగిల్లేలా చేస్తుంది.

ఇది చూసే వారికి ఆయన ద్వంద్వవైఖరి కలిగిఉన్నట్లు భావిం చేలా చేస్తుంది. ఈ దశలో కూడా సహ చరులు, అనుచరుల నుంచి ఆయన గౌరవాన్ని, అంకితభావాన్ని, సమగ్రతను, హోదా, ఆర్భాటం లాంటి వారిని కోరుకుం టారు. పార్టీ అధినేతను ఆకట్టుకునే ప్రయ త్నాల్లో అనుచరులు ఉంటారు. చిరం జీవి ధోరణి చివరకు అనుచరుల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. పార్టీపై, సహ చరులపై పట్టు కోల్పో తారు. అలా కావాలనే చేస్తున్నాడనే అభిప్రాయం కలుగు తుంది. ఒక పద్ధతి ప్రకారం తాను రాజకీ యాలకు దూరమవుతూ, అనుచరులు పార్టీకి దూరమ య్యేలా చేస్తున్నారన్న భావన ఇతరుల్లో కలుగుతుంది. ఫిలిం పర్సనాలిటీగా ఎంతగా దర్పం ప్రదర్శించారో, అలాంటి దర్పాన్ని ఇప్పుడు కూడా ప్రద ర్శిస్తునే ఉంటారు. క్రమంగా టీమ్‌లో ఎవరికి వారు బాస్‌గా వ్యవహరిస్తుంటారు.

మైండ్‌ సెట్‌
మన:కారకుడు అయిన చంద్రుడు కన్యారాశిలో ఉండడం జాతకుడి భావోద్వేగా లను ప్రభావితం చేస్తుంది. దేన్నయినా చూసి మనస్సు మార్చుకోవడమనేది ఉండ దు. కన్పించని ఆవేశాన్ని, క్రోధాన్ని అణచుకుంటూ ప్రతికూలమైనటు వంటి పరి స్థితులు, వ్యక్తుల యొక్క రాజకీయ అనుభవాలను, వారి సూచనలను స్వీకరించ లేకపోవడం,..ఆత్మరక్షణలో భాగంగా ఎదుటి వారిలో తప్పులెన్నడం లేదా వారిని విస్మరించడం చేస్తారు. పరిస్థితులకు అనుగుణంగా తనను తీర్చిదిద్దుకోవడంలో అశక్తత. దీంతో నిరాశానిస్పృహలకు గురవుతారు.

చిక్కుముళ్ళను ఎదుర్కోలేకపోతారు. యుక్తవయస్సులో ఏర్పడినప్పటి ముద్రలన్నీ కూడా ఆయన నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వాటిని బట్టి ఎదుటి వారిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. వాటిని సృష్టించుకునే ప్రయత్నాలు చేయలేకపోతారు. చేసినా అవి అతి స్వల్పకాలమే. ఈ ప్రయత్నంలో అవకాశాలు జాప్యం కావడం, నిరాశా నిస్పృహలు ఏర్పడుతాయి. అవన్నీ సహ చరులపై ప్రభావం కనబరుస్తాయి.

చిరాకు, విసుగు లాంటి వాటిని బయటకు ప్రదర్శించకపోయినా, మౌనంగా, మొండిగా ఉండడంవల్ల మరిన్ని అపార్థాలు వచ్చేలా చేసుకుంటారు. ఆ సమయంలో సహచరుల నుంచి బుజ్జగింపును కోరుకుంటారు. ఈ విషయంలో చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరమంతా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఓప్రేక్షకుడిలా, పరిశీలకుడిలా, తనకు పరిస్థితి అర్థమవుతున్నట్లుగా ఉంటారు గానీ తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నట్లుగా ఉంటారు. ప్రణాళిక బద్ద నిర్ణయాలు ఉండవు. సందర్భానికి తగినట్లు అనిగాకుండా, అప్పటికప్పుడు భావోద్వేగాల పరంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారు. తాను లైమ్‌లైట్‌లోకి రావాలనుకుంటే తిరిగి సినిమాలను ఆశ్రయించకతప్పదని భావిస్తుంటారు.

భావోద్వేగాలు
మను:కారకుడైన చంద్రుడి ప్రభావం భావోద్వేగాల పరంగా ఉంటుంది. ఆచరణలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తుంటారు. బయటకు కన్పించే భావోద్వేగాలకు అతీతంతగా తన మనస్తత్వాన్ని గోప్యంగా ఉంచుకుం టారు. ఆబ్సెంట్‌ మైండ్‌నెస్‌ ఉంటుంది. ఆయా పరిస్థితుల్లో వెంటనే స్పందించే లక్షణం కన్పించదు. తను మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో పరిపక్వత లేనివిగా లేదా అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే తపనతో కూడుకున్నవిగా ఉంటాయి.

అసందర్భంగా తన భావోద్వేగాలు బయటపెట్టి నవ్వులపాలయ్యే అవకాశం ఉం టుంది. సినిమా పరంగా తను ఊహిస్తున్న గ్లామర్‌ను పొందడంలో విజయం సాధిస్తారు. సినిమా రంగం ఆత్మసంతృప్తి కలిగించేలా ఉంటుంది. ఈ సంవత్సరంలో అనేక మార్లు చుట్టుపక్కల వారి బలాబలాలతో ప్రయోజనం పొందే స్థాయిలో ఉంటారు. అలా ప్రయోజనాలను అందించిన వారిని గుర్తించడంలో, ప్రశంసించడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలతో, డిప్లమసీగా ఉంటారు. మద్దతు దారులను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవహారధోరణిలో తన స్థాయి, హోదా లాంటి వాటిని చూస్తుంటారు. ఆ ధోరణిలో మార్పు ఉండదు. అవసరాలు తీర్చుకోవడంలో చలాకీతనం ప్రదర్శిస్తారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేయడమని గాకుండా, తెప్పను కూడా వెంట తీసుకెళ్ళేరకం.

నమ్మకాలు రాజకీయపరంగా దెబ్బతినడం వంటి లక్షణాలు (ప్రజలు ఇచ్చిన షాక్‌) ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చినట్లుగా కన్పిస్తాయి. గ్రహబలం: చిరంజీవి తులాలగ్నంలో, కన్యరాశి చిత్తా నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తాను ఎంచుకున్న రంగంలో (సినిమా)లో నిర్విఘ్నంగా ప్రయత్నాలు సాగుతాయి. సామాజికం, ఆగ్రహంలతో కూడిన సినిమా కాగలదు. సామాజిక సందేశాన్ని ఇచ్చే ఈ సినిమాకు ఈ సంవత్సరం ఆదిలోనే బీజం పడుతుంది. షూటింగ్‌ కూడా సజావుగా సాగుతుంది. అది సినిమారంగ పరంగా ఆయనకు సంతృప్తినిస్తుంది.

రాజకీయపరంగా సందిగ్దపరిస్థితుల ను ఎదుర్కొంటారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. జీర్ణసంబంధ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావచ్చు. జూన్‌ తరువాత ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం ఆయనకు ఆత్మపరిశీలనకు సమయం ఎక్కువగా కేటాయిస్తారు. తనను తాను ఎంతో ఉన్నత స్థాయిలో భావించుకున్నప్పటికీ, ఆ ఇమేజ్‌ చట్రం నుంచి బయటకు వచ్చి సగటు మానవుడితో కలిసే ప్రయత్నం చే యడం మంచిది. ప్రాథమికంగా ఆయన అల్పసంతోషి. చిన్నచిన్న వాటికి ఉబ్బిపోయే మనస్తత్వం. నైతికత, సేవాభావంతో కూడిన కార్యక్రమాలు చేపడితే మనశ్శాంతిగా ఉండడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.

నిరంతర బాటసారి !
KCR-Arrest 

(17 ఫిబ్రవరి 1954 కర్కాటక)కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా చంద్రలగ్నాత్‌ (కర్కాటకం) గురు దృష్టి కర్కాటకలగ్నంపై ఉండడం మూలంగా ఈ సంవత్సరం ఆయన మేథోసంపత్తి ఆయనకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇంటెలిజెన్స్‌, రిటెన్‌టివ్‌ పవర్‌ (నిలదొక్కుకునే శక్తి), పర్‌సిస్టెన్స్‌ పేషెన్స్‌ (సహనం) బాగా ఉంటాయి. ఈ రాశివారి ప్రాథమిక లక్షణాలు అవి. కావాల్సిన పనులు చేసి లేదా మాటలతోనో వీరిని ఎవరూ బుట్టలో వేసుకోలేరు. ఎదుటి వారి క్యారెక్టర్‌ను విశ్లేషించడంలో, అంచనా వేయడంలో పరిపక్వత కలిగిన సైకాలజిస్ట్‌లుగా వీరిని చెప్పవచ్చు. ఇతరుల క్యారెక్టర్‌ను, వారి ఉద్దేశాలు, లక్ష్యాలను ఏకకాలంలో అర్థం చేసుకోగలుగుతారు. మను: కారకుడైన చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవడం దీనికి కారణం. ఇతరులను బాగా పరిశీలించగలుగుతారు. ఆ స్థాయి సహనం ఉంటుంది. ఇతరులు ఏం చేస్తుంటారో పరిశీలిస్తారు. వారి చర్యలను చూస్తారు.

ఆ తరువాతే తాను రియాక్ట్‌ అవుతారు. ఆయన ఇంటెలిజెంట్‌ అయినప్పటికీ, గ్రాహక శక్తి మాత్రం తక్కువే. ఫ్రెష్‌ ఐడియాస్‌ గ్రహించడంలో స్లో అయినప్పటికీ కూడా గ్రహించిన దాన్ని నిలబెట్టుకునే శక్తి అధికం. ఫలితంగా విశాల దృక్పథం అలవడుతుంది. ఎప్పుడూ నిత్యనూతనంగా, వినూత్న ఆలోచనలను కలగి ఉంటారు. ఈ లక్షణాలు ఉండడం మూలంగా పర్‌ఫెక్షనిజాన్ని కలిగిఉంటా రు. మూర్ఖపు విశ్వాసాలు ఉంటాయి. తిరుగుబాటు మనస్తత్వం.

kcr-spee 

ఎదుటి వారిని తన కంట్రోల్‌ తెచ్చుకునేందుకు మాత్రమే దీన్ని వాడుతారు. పెట్రోల్‌ పోయడమే వచ్చు తప్ప ఆర్పడం రాదు. అదే సమయంలో మంటలు రేగుతుంటే బాధపడే సు న్నిత మనస్తత్వం. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి జారకుంటారు. నచ్చితే అందలం. నచ్చకుంటే పాతాళం.బలమైన మనస్థితులు కలిగిన వ్యక్తిత్వం.అలాంటి మూడ్స్‌ అన్నీ కూడా అంతశ్చేతన స్థితిలో ఉంటాయి. పని చేసే విధానంలో అసూ య ఉంటుంది. కంపేర్‌ చేసుకొని వారి కంటే అధికం అయ్యే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మంచి గుర్తింపు సాధించగలుగుతాడు. సాధారణ పరిస్థితుల్లో కాకపోయినా, చుట్టుపక్కల వారి సలహాలను ఆపత్కాలంలో పూర్తిస్థాయిలో పాటిస్తారు.

మైండ్‌సెట్‌
ఈ సంవత్సరం నుంచి అంతర్‌బుద్ధి (ఇంట్యూషన్‌), మేధస్సు (ఇంటెలిజెన్స్‌) ఏకకాలంలో పని చేస్తాయి. అంతరాత్మ సూచనలను నమ్మితే అంతర్‌బుద్ధి పని చేస్తుం ది. ప్రస్తుత సంఘటనలను తార్కికంగా, హేతుబద్దంగా విశ్లేషించుకుంటూ పని చేస్తారు. బాటిల్‌ మూత ఓపెన్‌ చేయడంలో సక్సెక్‌ అయినప్పటికీ, అందులోని అం శాన్ని వివరించంలో విజయం పాళ్ళు తక్కువే. గతజ్ఞాపకాలను స్ఫురణకు తెచ్చు కోవడం అధికం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో మొదటి ఆరు నెలలు ఆడింది ఆట, పాడింది పాట. జులై వరకు ఈ పరిస్థితి ఉంటుంది.

అక్కడి నుంచి సెప్టెంబర్‌ వరకు ఆయనను వేరే వారు ఉపయోగించుకుంటారు. అపార్థాలకు గురయ్యే స్థాయికి పరిస్థితులు దిగజారుతాయి. ఈ ప్రక్రియలో న్యాయం, సమానత్వం బ్యాలెన్స్‌ చేస్తూ చేసే యుద్ధంలో తనను బాగా విశ్వసించే వారి సానుభూతిని మాత్రమే పొందగలుగుతారు. కృతజ్ఞతాభావం ఉన్నవారు, నమ్మిన వారు మాత్రమే ఆయన పక్కన ఉం టారు. వ్యూహం, చొరవ, వ్యక్తిత్వం, సమగ్రత ఉన్న వారు ఆయనకు దూరం అవుతారు. అప్పటి వరకూ ఉన్న స్పష్టత ఆయనలో పటాపంచలు అవుతుంది. అయోమయ దశకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో భావోద్వేగాలు, సెంటిమెంట్‌లపై ఆధారపడుతారు. అప్పుడు తనను తిరిగి నిలబెట్టగల వ్యక్తుల, పరిస్థితుల కోసం, స్పష్టత కోసం పరితపిస్తారు. మూడ్‌స్వింగ్స్‌ ఉంటాయి. తీసుకునే నిర్ణయా ల్లో అనుభవం ద్వారా పొందిన పాఠాలపై ఆధారపడుతారు. గతంలో ఉన్న చొరవ, పట్టుదల ఉండకపోవచ్చు. పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుం ది. దీర్ఘకాలంగా దాచిన గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఆయన పరిస్థితిని సంక్లిష్టం చేస్తాయి.

భావోద్వేగాలు
కేసీఆర్‌ ప్రాథమికంగా సంప్రదాయవాది. ఎదుటి వారిని ప్రభావితం చేసి పని చేయించడంలో ఎంత కష్టపడుతారో అంతకంటే ఎంతో త్వరగా డిటాచ్‌ (అనుబంధం తెంచుకోవడం) కాగలుగుతారు. ప్రేక్షకపాత్ర పోషించే అవకాశం ఉంది. సెకండ్‌ హాఫ్‌లో ఈ వ్యక్తిత్వాన్ని చూడవచ్చు. సూక్ష్మదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళిక బలహీనంగా ఉండడం, పరస్పరం సంఘర్షించే భావోద్వేగాలు, కెయాటిక్‌ ఎమోషన్స్‌ ఉంటాయి.
వ్యక్తులతో, సంస్థలతో సంబంధాలు, అనుబం ధాలు దెబ్బతింటాయి. పరిస్థితులు తన నియం త్రణ తప్పుతాయి. పరిస్థితుల్లో అనుకోని మార్పులకు ఆజ్యం పోస్తారు. తనకు వ్యూహాలకు అనుగుణమైన నిర్ణయాలు, సంకేతాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తాయి. భావోద్వేగాలపరంగా కలగూరగంపలా మారిపోతా రు. జులై - అక్టోబర్‌ మధ్య కాలంలో అసంకల్పితంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సామాజిక అస్థిరతను కలిగిస్తాయి.
గ్రహబలం
గోచారరీత్యా చంద్రలగ్నాత్‌, అష్టమాధిపతి అయినటు వంటి శని కన్యారాశిలో దృష్టి వ్యయస్థానాన్ని చూడడం (మిథునరాశి) వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలుంటాయి. శారీరక శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. పరిస్థితులను, వ్యక్తులను శాసించాలనుకునే ప్రక్రియలో వాటికి అనుగుణంగా మారుతూ అక్కడ ఇమడలేరు. చాలా వరకు వ్యూహాలను తగ్గించుకుంటారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించరు. వెనుక ఉండి నడిపించరు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో (మీనరాశి) ఉండడం, ప్రథమార్థంలో కొంతవరకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది.తన ప్రణాళికలకు అనుగుణంగా నడిపించేందుకు సమయం, సందర్భం కలసి వచ్చినప్పటికి కూడా శని దృష్టి ప్రభావం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుటుంబసభ్యులపైన లేదా పిల్లలకు సంబంధించిన అంశాలపై ఇతరుల నుంచి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మారుతున్న గ్రహస్థితికి అనుగుణంగా అనుకున్నది సాధించడంలో వ్యక్తిగా రెండో అర్థవార్షికం మేలు చేయదు. పార్టీలోనే ప్రత్యామ్నాయ నాయకులు వస్తారు. సమష్టి దృష్టి పోయి వ్యక్తిగత ధోరణి పార్టీలో పెరుగుతుంది.

Nagnathఇదంతా కూడా శని ప్రభావం అని చెప్పవచ్చు. ఆయన ద్వారా కదలాల్సిన పాచికలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఆపినప్పుడు, ఆ ప్రభావం చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తుంది. దిశానిర్దేశం లేకపోవడం, అనుకూల పరిస్థితుల్లో అతి విశ్వాసం చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో, తనకు తాను మౌల్డ్‌ చేసుకోవడంలో జాప్యం లేదా అందుకు అనుగుణంగా మారలేకపోవడం ఇలాంటి లక్షణాలతో అయోమయ స్థితిలో పడుతారు. లైమ్‌లైట్‌లో మాత్రం ఉంటారు. అనుకున్నది సాధించడంలో కన్నా సాధించే ప్రక్రియలో గుర్తింపు పొందడంలో మాత్రం సక్సెస్‌ కాగలుగుతారు.(ఈ విశ్లేషణ అంతా కూడా ప్రచారంలో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా, ఆయా జాతకుల 27.12.2010 నాటి గ్రహస్థితి ఆధారంగా)
- ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌

Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Monday, November 29, 2010

తల్లీ కొడుకులు పార్టీకి.. పదవులకూ.. గుడ్‌బై * నన్ను పంపించాలనుకున్నారు నేనే వెళుతున్నా ! * ఒంటరిని చేసే కుట్రపన్నారు...

కాంగ్రెస్‌కు వైఎస్ జగన్ రాజీనామా
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
jagan-car
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి,
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖను రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డిగారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్‌ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్‌.వివేకానందరెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాంనబీ ఆజాద్‌ సూచనలతోనే చిన్నాన్న ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను.

Smt-Vijayalakshmiజరుగుతున్న పరిణామాలన్నీ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికీ, రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలను తుడిచివేయడానికి జరుగుతున్నవేనని నాకు అర్థమవుతూనే ఉంది. అసలెందుకు ఇలా జరుగుతోంది. నేను చేసిన నేరమేమిటి? నా మీద, నా కుటుంబం మీద ఎందుకు ఇలా త్తి కట్టారు? నా తండ్రీ కీర్తి ప్రతిష్టల మీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏమిటది? నా తండ్రి చనిపోయిన రోజున 150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవికి నా పేరును ప్రతిపాదించి సంతకాలు చేస్తే మీ అభీష్టం మేరకు నేను దూరంగానే ఉన్నానే.. అది తప్పా? మీ ఆదేశాన్ని శిరసావహించి రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి నేనే ప్రతిపాదించాను కదా.. అది తప్పా? మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని పెట్టాలనుకున్నప్పుడు సీఎల్‌పీ సమావేశం సజావుగా సాగేలా సంపూర్ణంగా సహకరించాను కదా. అది కూడా తప్పేనా?

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్ర ధర్మమనీ ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీ మీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

recogniation'అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభించిన నాటి నుంచి మా మీద దాడి మొదలైంది. కారణం ఆ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడమే. జనం గుండెల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నాడని, సజీవంగా ఉంటాడని తేటతెల్లం కావడం కొందరు కాంగ్రెస్‌ పెద్దలకు మింగుడు పడలేదు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. పార్టీని రెండు సార్లు ఒంటిచేత్తో విజయపథానికి నడిపించిన జననేత విగ్రహాలు ఊరూరా పెడితే పార్టీకి ఏ విధంగా నష్టమో చెప్పగలరా? లేని ఉద్దేశాలను నాకు ఆపాదించారు.మొదటి నుంచి కూడా రాజశేఖరరెడ్డి గారి ఉన్నతిని ఓర్వలేని కొందరు నేతలు చేస్తున్న కార్యక్రమంగా దీనిని నేను సరిపెట్టుకున్నాను.

కానీ క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్‌ ప్రతిబింబాన్ని తుడిచివేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్లు నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్ఠానం ఆశీస్సులే ఉన్నట్లు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శనకు అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా, చిరంజీవికి అయినా ఒక్కరోజులో అపాయింట్‌మెంట్‌ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్‌ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్‌మెంట్‌ అడిగితే నెలరోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమి బాధపడలేదు.

jagan-standఆ భేటీలో మీకు అన్ని విషయాలు వివరించాం. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనకూడదని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్లు చేశారు. ఆ యాత్రకు ఎవ్వరూ సహకరించకుండా ప్రయత్నాలు చేశారు. అయినా వైఎస్‌ను అభిమానించే జనసామాన్యం, కిందిస్థాయి కార్యకర్తల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగింది. యాత్రలో పాల్గొన్న వారి మీద, నాకు సహకరించిన వారి పైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. మద్దతుగా నిలిచిన వారిపై వేటు వేశారు.

ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు.కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు.దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు.

ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్‌ జ్ఞాపకాలను తుడిచివేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదస్పదమవుతోంది.ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు. అన్నిటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్‌ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి.

ఆ అనుమానాలకు సీబీఐ, నిపుణుల నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేకపోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. దాని గురించి మాట్లాడటమే మహాపాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మహానేత హెలికాప్టర్‌ దుర్ఘటనకు సంబంధించి అనేక సందేహాలను నివృతి చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయినా దాని మీద ఏం మాట్లాడిన ఎలాంటి పెడర్థాలు తీస్తారోనన్న అనుమానంతో క్రమశిక్షణ గల కార్యకర్తగా మౌనంగా భరిస్తూ వచ్చాను. అంతే కాదు ఓ రష్యన్‌ వెబ్‌సైట్‌ వెలువరించిన కథనం ఆధారంగా కొన్ని ఛానళ్లతో పాటు సాక్షి కూడా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది మహాపరాధమైనట్లు సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు.

నన్ను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్‌లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు కాంగ్రెస్‌ నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్‌ ఒక విశ్లేషాణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలంశాలను చర్చించింది.

ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి. అలాగే బీహార్‌ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్‌ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్లతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్‌ గానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్య్ర మీడియా సంస్థలుగా నిష్పక్షపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌, వీరప్ప మొయిలీ, ఆనంద్‌ శర్మ వంటి కాంగ్రెస్‌ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

అప్పుడూ ఏ ఒక్కరు నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ ఛానల్‌లో కాంగ్రెస్‌ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిలీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్‌ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీనుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?

వీటికి తోడు ప్రతి రోజు నాపైన గాలి వార్తల ప్రచారం, నా మీద వేటుకు రంగం సిద్దమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్ళే ఏ చిన్న పిల్లాడిని అడిగినా నేడో రేపో జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తారు. అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విషప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్ఠానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లిగారు, పార్లమెంట్‌ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు.ఒంటరిగా నేనే వెడుతున్నాను. ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను.

నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్‌ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇకముందూ వ్యవహరించబోను.మళ్లీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 150 మంది శాసనసభ్యులు నా ముఖ్యమంత్రిత్వాన్ని బలపర్చిన నాడు మీ అభీష్టాన్ని మన్నించానే తప్ప చంద్రబాబు లాగా వైశ్రాయ్‌ తరహా క్యాంపులు నడిపి గద్దెనెక్కి కూర్చోలేదు. విలువలకు కట్టుబడిన వాడిని కనుకనే అలా చేయలేదు.

మీరు రోశయ్య గారిని ముఖ్యమంత్రిని చేయాలని తలవగానే సీఎల్‌పీలో ఆయన పేరును నేనే ప్రతిపాదించాను. ఉన్నత విలువల కోసమే ఆ పని చేశాను.ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేయడానికి జరిగిన సీఎల్‌పీ సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేందుకు సహకరించిందీ ఉన్నత ప్రజాస్వామ్య విలువల కోసమే. నేను స్థాపించిన సాక్షి మీడియా సంస్థ కూడా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకున్నది కూడా ఆ విలువల కోసమే. అలా వ్యవహరించబట్టే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌ ప్రజాదరణ పొందాయి.

విశ్వసనీయతను ఊపిరిగా భావించినందువల్లే స్థాపించిన రెండేళ్ళలోనే 14 లక్షల పైచిలుకు సర్క్యులేషన్‌ సాధించి సాక్షి దినపత్రిక రికార్డును సృష్టించింది, నేను పాటించిన ఉన్నత విలువలకు అదే సాక్షి. అందుకే చెపుతున్నాను... నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను.. గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను.. నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా త్రండి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.

యుద్ధ శంఖారావం !
కడప ఎంపీ జగన్‌ యుద్ధం ప్రకటించారు. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి పైనే సమర శంఖారావం పూరించారు. ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించారు. అయిదు పేజీల లేఖతో ఆమె వ్యవహార శైలిని అడుగడుగునా తప్పుబట్టారు. అది సోనియా గాంథీ మీద రాజకీయ దాడి. తనకు జరిగిన అన్యాయానికి ఆమెను అడుగడుగునా నిలదీశారు. సోనియానుద్దేశించి రాసిన లేఖే అయినా, ప్రజలను, వారి మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని పదజాలాన్ని వాడారు. విశ్వసనీయత గురించి ఆయన పదే పదే ప్రస్తావించడం ద్వారా తాను ప్రజల మనిషిగా ఉంటానని, వారికే విశ్వసనీయుడినని చెప్పక చెప్పారు.

ఆక్రోశం, ఆవేదన, వ్యధ కలగలిపి తయారు చేసిన ఆ సుదీర్ఘ లేఖ రాష్ట్రంలో రాజకీయ సంద్రాన్ని అతలాకుతలం చేసింది. అదే సమయంలో ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించింది. తన బాబాయ్‌ వివేకానంద రెడ్డిని సోనియా గాంధీ పిలిపించడం ద్వారా తమ కుటుంబంలో చీలికలు తెచ్చే కుటిల నీతికి పాల్పడ్డారని, అదే తనను బాధించిందని చెప్పడం ద్వారా తాను పార్టీని వీడి పోవడానికి దారి తీసిన అనేక కారణాల్లో అదే ప్రధాన కారణమని అన్యాపదేశంగా చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు తనను చూసి భయపడుతున్నారని, తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన మీద కక్ష తీర్చుకుంటున్నారని స్వయంగా అందులో ధ్వజమెత్తారు.

తన తండ్రి పేరు ప్రతిష్టలను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆవేదనతో పాటు జన సామాన్యం తన వెంటే ఉందన్న ధీమా ఏక కాలంలో ఈ లేఖలో కనిపించాయి.నిజానికి ఈ లేఖ సోనియా గాంధీకి ఉద్దేశించిందే అయినా, అది కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సరికొత్త సవాళ్లను తెచ్చి పెట్టింది. ఆయన నియామకం జరిగి పట్టుమని నాలుగైదు రోజులైనా గడవక ముందే..కేబినెట్‌కు సంపూర్ణ రూపం ఇవ్వక మునుపే జగన్‌ తన అమ్ముల పొదిలోని రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అది సోనియా మీద కలిగించే ప్రభావం ఒక రకమైనదైతే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ మీద కలిగించే ప్రభావం మరో రకమైనది.

బుధవారం ఆయన జరప తలపెట్టిన కేబినెట్‌ ప్రమాణ స్వీకారం ఆయనకే అగ్ని పరీక్షగా మార నున్నది. మంత్రి పదవుల మీద ధీమాగా ఉన్న ఆశావహులంతా ప్రస్తుతానికి ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నా, రేపు మంత్రి మండలిలో చోటు దొరకలేదని రూఢి అయ్యాక ఎవరి దారెటో కనుక్కుని ముందుగానే కాయకల్ప చికిత్స చేయడం కొత్త ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహానికి పరీక్షగా నిలిచింది.పదవులకు అతీతంగా పార్టీ శ్రేణులనందరినీ ఏకతాటి మీద నిలపడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. కేబినెట్‌ ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రభుత్వ రోజు వారీ నిర్వహణలో తల మునకలు కావాల్సిన సీఎం హఠాత్తుగా ఈ కొత్త రాజకీయ సవాలును ఎదుర్కోవాల్సివచ్చింది.
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
ఒంటరిగా వెళ్తున్నా
కుటుంబాన్ని చీల్చే కుటిల నీతిపై మనస్తాపం
అదేబాటలో వైఎస్ సతీమణి విజయమ్మ
కారణాలు వివరిస్తూ సోనియాకు ఐదు పేజీల బహిరంగ లేఖ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని స్పష్టీకరణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామా చేయొద్దని యువనేత విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెను సంచలనం... పద్నాలుగు నెలల అవమానానికి, దాడికి, బెదిరింపులకు జవాబు. తన పైన, తన కుటుంబం పైన, వైఎస్ ఇమేజ్ పైనా జరుగుతున్న దాడిని, వైఎస్ కలలుగన్న ప్రజా సంక్షేమం పట్ల అలక్ష్యాన్ని ఇన్నాళ్లు సహనంతో భరించిన జగన్ హుందాగా బంధనాలు తెంచుకున్నారు... ‘ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం’ అని తండ్రి చెప్పిన, తాను నమ్మిన విలువలకు కట్టుబడుతూ యువనేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని, పదవులనూ వదిలేస్తూ వైఎస్ సతీమణి విజయమ్మ, తనయుడు జగన్ పార్టీ నుంచి నిష్ర్కమించారు. కాంగ్రెస్‌కు మారుపేరైన.. కాంగ్రెస్‌కు రాష్ర్టంలో పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, సతీమణి బయటికి వెళ్లే పరిస్థితి రావడాన్ని... దానికి అధిష్ఠానమే స్వయంగా సారథ్యం వహించడాన్ని చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది.. ఆవేదన చెందింది.. ఆవేశపడింది. కన్నీరు పెట్టింది. జనం వీధుల్లోకి వచ్చారు. నిరసన గొంతుక వినిపించారు. డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామాలు సమర్పించారు. మేమూ మీ వెంటేనని నినదించారు. యువనేత రాజీనామా వార్తతో జాతీయ, రాష్ట్ర మీడియా హోరెత్తిపోయింది. ఇది కాంగ్రెస్‌కు చావు దెబ్బేనంటూ చానళ్లన్నీ విశ్లేషణలందించాయి. జగన్ నిర్ణయం సరైనదేనన్న జనాభిప్రాయాన్ని ఒపీనియన్ పోల్స్ ద్వారా అందించాయి. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయాల్లోనూ విశ్వసనీయత, ఉన్నత విలువలు పాటించాలన్న వైఎస్ ఆదర్శాలకు అనుగుణంగా... ఆత్మవిశ్వాసం, హుందాతనం తొణికిసలాడేలా జగన్ తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇంటర్నెట్‌లోనూ అదే సంచలనం. గూగుల్ టాప్ 10 వార్తల్లో ఇదే తొలి స్థానంలో నిలిచింది. రాష్ర్ట రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు సోమవారం నాటి పరిణామాలు అద్దం పట్టాయి

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కడప లోక్‌సభ స్థానానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. ఆయన మాతృమూర్తి, వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పార్టీ సభ్యత్వానికి, పులివెందుల శాసనసభ స్థానానికి రాజీనామా సమర్పించారు. తన తండ్రి జీవితాంతం నమ్మి పాటించిన, ఏడాదిన్నరగా తాను అనుసరిస్తూ వచ్చిన విలువలకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ ప్రకటించారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయనది సరైన నిర్ణయమని, కాంగ్రెస్ తప్పిదమే ఇందుకు కారణమని, ఇది పార్టీకి పెను నష్టమని పలు తెలుగు వార్తా చానళ్ల ఒపీనియన్ పోల్స్‌లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో అభిప్రాయపడ్డారు. పార్టీని ఎందుకు వీడాల్సి వస్తున్నదీ వివరిస్తూ అధినేత్రి సోనియాగాంధీకి జగన్ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని ఆమెకు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా తనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. తద్వారా జగన్ రాజకీయ పరిణతిని చాటుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తనను పార్టీ నుంచి గెంటేసేందుకు అధిష్టానం స్థాయిలోనే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఏడాది న్నరగా తనను ఎలా వేధించిందీ సోదాహరణంగా వివరించారు.

అందుకు అనుగుణంగానే గత 14 నెలలుగా తనపై నానారకాలుగా దాడి జరుగుతోందని, అవమానాలపాలు చేస్తున్నారని అన్నారు. ఈ విష ప్రచారాలన్నింటికీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉండటం కలచివేసిందని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకిగా ముద్ర వేసి బయటకు పంపాలని చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిని చేసి బయటకు పంపాలనుకున్నారని, అందుకే ఒంటరిగా తానే వెళ్తున్నానని ప్రకటించారు. ‘‘పార్టీ కోసం జీవితాంతం పాటుపడ్డ మహా నేతను కూడా తెరమరుగు చేసేందుకు, ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించారు. చివరికి తాజాగా ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టే నైచ్యానికి కూడా ఒడిగట్టి, నేను పార్టీని వీడక తప్పని పరిస్థితులను కల్పించారు. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది ప్రజలకు అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది’’ అని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ప్రధానమని వైఎస్ పదేపదే చెప్పిన సూత్రాన్ని ప్రస్తావించారు. తండ్రి నేర్పిన విలువలను దిగజార్చేలా ఇంతదాకా వ్యవహరించలేదని, ఇకముందూ వ్యవహరించబోనని స్పష్టం చేశారు. ఆయన నుంచి అబ్బిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలే తనను ముందుకు నడిపిస్తాయన్నారు.

జగన్ రాజీనామా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆయన లేఖను మీడియాకు విడుదల చేశారు. అప్పటి నుంచి రోజంతా జాతీయ, ప్రాంతీయ మీడియా మొత్తం దీనిపైనే వార్తలు, కథనాలు, విశ్లేషణలతో హోరెత్తించింది. ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ లైవ్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, జీన్యూస్ వంటి జాతీయ చానళ్లతో పాటు వాటి వెబ్‌సైట్లలోనూ జగన్ వార్తే ప్రముఖంగా కన్పించింది. వాటికి అనుబంధంగా అనేక న్యూస్ వీడియో క్లిప్పింగ్‌లను ఆ వెబ్‌సైట్స్ అందుబాటులో ఉంచాయి. ఇంటర్నెట్‌లో కూడా జగన్ రాజీనామా వార్త హవాయే నడిచింది. గూగుల్ సెర్చ్‌లో సోమవారం భారత నెటిజన్లు అత్యధికంగా వెదికిన పదంగా (కీ వర్డ్) ఇది నిలిచింది. గూగుల్ టాప్ 10 వార్తల్లో రాజీనామా సంబంధిత అంశాలే టాప్ ఫైవ్‌గా నిలిచాయి! మరో సెర్చ్ ఇంజన్ యాహూ టాప్ స్టోరీల్లోనూ ఇదే మొదటి వార్తగా నిలిచింది.

రాజీనామా గురించి తెలియగానే రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. పలు చోట్ల జగన్‌కు మద్దతుగా, కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలకు దిగారు. అనంతపురం, కడప వంటి చోట్ల అభిమానులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులకు దిగారు. కాంగ్రెస్ నేతలతో పాటు కొన్నిచోట్ల సోనియాగాంధీ దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. సోనియా, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను దహనం చేస్తున్నారన్న వార్తలు తెలియడంతో జగన్ వాటిని ఖండించారు. అటువంటి చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిందిగా సూచించారు.

రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కూడా జగన్ రాజీనామా తీవ్ర కలకలం సృష్టించింది. దీని పర్యవసానాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించుకోవడం కన్పించింది. జగన్ వద్దన్నా, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. రాష్టవ్య్రాప్తంగా పీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు... ఇలా అన్ని స్థాయిల నేతలూ భారీ సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు!

జగన్ ఈగోను దెబ్బ తీశారా?

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని ఎప్పుడో నిర్ధారణకు వచ్చిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఆపరేషన్ జరిపినట్లు గత వారం రోజుల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ఈగోను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటూనే ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా వైయస్ జగన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు పూనుకుంది. తన తండ్రి వైయస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్ఫీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తనకు వ్యతిరేకంగా రంగంలోకి దింపుతున్నట్లు వైయస్ జగన్ కు అర్థమైంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగానే హుటాహుటిన వైయస్ జగన్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ సిఎల్పీ సమావేశం ప్రణబ్ అనుభవంతో వ్యూహాత్మకంగా చడీ చప్పుడు లేకుండా ముగిసింది. అది వైయస్ జగన్ కు తీవ్రమైన దెబ్బనే.

ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.

మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.

మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.