Friday, May 25, 2012

స్ఫూర్తి కొరవడిన పంచాయతీలు

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతున్నాయి? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి   దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే.

కారణాలు ఏమైనప్పటికీ, ఈ రోజు పల్లెల్లో పల్లె మాట, ఆట, పాట; పల్లె ప్రేమ-అనురాగాలు అన్నీ మసిబారి పోయాయి. మానవీయ విలువలు, నిజాయితీ, కష్టించే తత్వానికీ, నిస్వార్థానికీ నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడ్డ పల్లె యువత నేడు మద్యం మత్తుకు బానిసలవుతున్నట్లే, అవినీతి రాజకీయాలకూ బానిసలవుతున్నారు. స్త్రీలపై హింస, అణచివేత, అసహనం, వివక్ష రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు పంచాయతీలనూ వాటిని నడిపించే ప్రెసిడెంట్ల పనితీరునూ ఖచ్చితంగా నిలదీయాల్సిందే. కక్ష సాధింపులూ, ఓట్ల రాజకీయాలూ తప్ప అభివృద్ధి లక్ష్యంగా సాగాల్సిన స్థానిక పాలన కోసం చేసిన పంచాయతీ రాజ్ చట్టాల స్ఫూర్తి దెబ్బతిన్నది. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో ముఠా తగాదాలు పెరిగి విభజించి పాలించే తత్వం వేళ్ళూనుకుంటున్నది.

ఏ కొంచెం చదువు, జ్ఞానం వున్న వాళ్ళైనా, పల్లెలు బాగుంటే భారతదేశం బాగుంటుంది అని నమ్మే పెద్ద మనసున్న వాళ్ళైనా-పల్లెల గురించి ఆలోచించటం అంటే పంచాయతీల పనితీరు చర్చించటమే! మనకున్న చట్టాలు చాలా గొప్పగా ఉన్నట్లే పంచాయతీరాజ్ చట్టం కూడా ఎంతో గొప్పగానే తీర్చి దిద్దుకున్నాం. కానీ పంచాయతీలు నడుస్తున్న తీరు గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలని ఏలుతున్న నీతిబాహ్యమైన, పార్టీ రాజకీయాలకు ఎంత మాత్రం తీసిపోదు. పంచాయతీ ప్రెసిడెంట్‌లు, ఆయా గ్రామాల్లో ఒక చిన్నపాటి గూండా రాజ్యాన్ని తయారు చేస్తున్నట్లే కనిపిస్తుంది! వారి వారి పార్టీలని బతికించుకోడానికి, బలోపేతం చేసుకోడానికి, ఓట్లు పెంచుకోడానికి సీట్లు రాబట్టుకోవడానికే పనిచేస్తున్నారు తప్పించి, పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తి అమలుకావటం లేదు. పంచాయతీలని నడిపిస్తున్న ప్రెసిడెంట్లు, ఆర్థిక సామాజిక దోపిడీలకు పాల్పడుతుంటే పట్టించాల్సిన, పట్టించుకోవాల్సిన ప్రజాస్వామిక వ్యవస్థ స్తబ్దుగా తయారైంది.

గుంటూరు జిల్లాలోని ఒకానొక గ్రామంలో ఆ ఊరి ప్రెసిడెంట్, తన పార్టీకి చెందని గ్రామస్తులని కనీసం పలకరించడు కూడా! అదే గ్రామంలో, వేరే పార్టీకి చెందిన ఒక పేద కుటుంబం, టైలర్ పని చేసుకుంటూ కష్టార్జితంతో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటోంది. అటుగా వెళ్తున్న ఊరి ప్రెసిడెంట్ - ఎప్పుడూ పలకరించిన పాపాన పోనివాడు, ఆగి మరీ అడిగి ఇసుక ఎక్కడినుంచి వస్తుందో కనుక్కుంటాడు. అంతే, తెల్లారితే కప్పు వేయాల్సిన ఇంటిపని కాస్తా అర్ధంతరంగా ఆగిపోతుంది. ఎందుకంటే సమయానికి రావాల్సిన ఇసుక లారీ, ప్రెసిడెంట్ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్‌తో ఎక్కడో సీజ్ చెయ్య బడింది! అదే ఊరిలో ఇద్దరు అత్తా కోడళ్ళు గొడవపడితే, ముసలి అత్తను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసినప్పటికీ కోడలికి మద్దతు పలికితే ఎక్కువ ఓట్లు వస్తాయని లెక్క వేసుకుని, కోడలికే వత్తాసు పలుకుతాడు.

అందుబాటులోకి వచ్చిన రాయితీలను ఉపయోగించుకుని వాగులో మట్టి తవ్వి అమ్ముకోవటం, సొంత చేన్లో లెక్కకు మించి స్కీముల కింద బావుల్ని తవ్వుకుని మట్టి అమ్ముకోవటం, ఊరికోసం వచ్చిన ప్రభుత్వ పథకాలన్నీ పొల్లుపోకుండా సొంత పార్టీ వాళ్ళకి వాడి డబ్బు చేసుకోవటం మొదలైన విషయాల్లో అందె వేసిన చెయ్యి అతనిది.

ఊరికి ప్రెసిడెంట్ కాక ముందు మామూలు రైతు, ప్రెసిడెంట్ అయ్యాక మూడేళ్ళు కూడా తిరక్కుండానే లక్షాధికారి! అవతల పార్టీ సానుభూతిపరుల కుటుంబాలను రాచి రంపాన పడేయటం, పేద కుటుంబాలు అయితే ప్రభుత్వ పథకాలని రానీయకుండా చేయడం -కొంచెం ఆర్థిక స్వావలంబన ఉన్న కుటుంబాలు అయితే వారికి ఆదాయాన్నిచ్చే మార్గాలకి పూర్తి స్థాయి అంతరాయం కల్పించటం, దాని కోసం ఎంతటి దగుల్భాజీ పనైనా చేయటం అతని కర్తవ్యంగా నెరవేరుస్తాడు.

ఆ గ్రామంలో సెంటు భూమి ఖాళీ ఉండదు. పిల్లలు ఆడుకొనే ఆట స్థలం ఉండదు. వీధి దీపాలు విధిగా వెలగటం 40 ఏళ్ళుగా ప్రశ్నార్థకం. కాని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతాయి- బెల్టుషాపు ఓనర్లకి; ఏడాదికోసారి అంగరంగ వైభవంగా (రాజకీయ పార్టీల) పే రుతో ఊరబంతులు పెట్టి, తాగబోయించి, రికార్డు డ్యాన్సులు పెట్టిస్తారు. ఎవరి కోసమో అనుకుంటున్నారా- అన్నీ త్యజించి, త్యజించమని లోకానికి ఎలుగెత్తిచెప్పిన సాధువు వీరబ్రహ్మం గారికి! ఓట్ల కో సంపడే పాట్లలోభాగమని చెప్పకుండానే ఆయనకో గుడి కట్టిస్తారు...

ఆ ఫలానా రాజకీయ పార్టీ అనుయాయుడుగా మారి జనాన్ని తన అప్రజాస్వామిక పద్ధతుల్లో పంచాయతీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి, భయ భ్రాంతులకి గురిచేయటమే కాక, అమాయక రైతులని, పేద వాళ్ళని, యువతని తన అవినీతిలో నెమ్మది నెమ్మదిగా భాగస్వాములని చేసుకుంటున్నాడు. 'ఎవడు మాత్రం కడిగిన ముత్యం? తింటే తిన్నాడు -ఎంతో కొంత మాకూ ఇస్తున్నాడు కదా, పని కూడా చేస్తున్నాడు కదా!' అనే వాళ్ళ సంఖ్య పెంచుతున్నాడు. ప్రజాస్వా మ్యం అంటే ప్రజల గొంతు, వారి ఆకాంక్ష అనుకునే ప్రజాస్వామ్య వాదులకు 'ప్రజలతోనే బుద్ధి చెప్పించే' ప్రయత్నమే ఇది.

ఈ అవినీతి రాజకీయ నేతలు పల్లెల్లో ప్రెసిడెంట్ల నుంచి పట్నాల్లో బడా రాజకీయ నాయకుల దాకా ప్రజలని కూడా అవినీతిలో భాగస్వాములను చేస్తున్నారు. కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్య తప్పించి, పంచాయితీ ప్రెసిడెంట్ల తీరు దాదాపుగా రాష్ట్రమంతటా ఇదే తీరు అని చెప్పుకోవడంలోఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే జిల్లాల పేర్లు, పార్టీ పేర్లు మారొచ్చు. అంతే తేడా!

రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామం ప్రెసిడెంట్ తన ఊరిలోని ఒక రేప్ కేసులో నిందితుడిని కాపాడడానికి చెయ్యని సాహసం లేదు. పోలీస్ కేసుని వాపసు తీసుకోమని ఒత్తిడిపెంచడం దగ్గరినుంచి, పోలీసులతోటే బెదిరించడం, ఊరి జనాన్ని ఎగతోయడం, 'మా ఊర్లో ఏమైనా జరిగితే ముందు మా దృష్టికి రావాలిగాని, పోలీసుల దృష్టికి ఎందుకు పోవాలి?' అనే ప్రశ్నలు సంధించడం, ఊరిలో ఎట్లా తిరుగుతారో చూస్తాం అని బెదిరించడం, ఏ పార్టీకి సంబంధం లేని ఒక సేవా సంస్థ మీద 'వారు అవతలి పార్టీకి సానుభూతి పరులు, అందుకే మన మీద కేసు పెట్టారు' అని అబద్ధపు ప్రచారం చేయటం వగైరా అన్నీ చేశాడు.

ఇదంతా ఎందుకు చేశాడు అంటే, పంచాయతీ ప్రెసిడెంట్‌కి, నిందితుని పట్ల ప్రేమా కాదు, బాధితుల పట్ల ద్వేషమూ లేదు - ఓట్ల కోసం అదొక లెక్క! ఆ గ్రామంలో ఆ నిందితునికి సంబంధించిన సామాజిక వర్గానికి ఎక్కువ నోట్లున్నాయి! అతని దృష్టిలో ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే, కాళ్ళ బేరానికొచ్చి, ఊరి పెద్దకి చెప్పుకుని నాలుగు పైసలు పరిహారంగా తీసుకొని వెళ్ళి పోవాలే తప్ప అతని ఓట్ల లెక్కలకి అడ్డు వచ్చి, పోలీసులకి చెప్పి, కోర్టులకెక్కి చట్టం న్యాయం అని వాపోతే ఆ ప్రెసిడెంట్ ఎట్లా ఏడిపించాలో అట్లా ఏడిపిస్తాడు.

నల్లగొండ జిల్లాలో ఒక తండా. 15 ఏళ్ళ గొర్రెల కాపరి. ఆ వయసులోనే ఊరి మగపిల్లల దాష్టీకానికి గురైంది. ఆరు నెలలు నిండేవరకు ఏమీ అర్థం కాలేదు. పొట్ట పెరిగిందని తల్లి డాక్టర్‌కి చూపిస్తే విషయం తెలిసింది. ఇంటికి తీసుకొచ్చి బిడ్డని తల్లీ తండ్రీ ఇద్దరూ కొట్టి చంపారు. విషయం ఊరిలో అందరికీ తెలుసు. ప్రెసిడెంట్‌కి కూడా తెలుసు. సమాచారం పోలీసులకి చేరదు! చట్టం దృష్టికి పోదు... 'గర్భిణిని పూడ్చకూడదు, ఊరికి అరిష్టం అనే మూఢనమ్మకాన్ని మాత్రం ఊరి వాళ్లు తుచ తప్పక అమలుచేయటానికి ఊరి ప్రెసిడెంట్ జనంతో మమేక మవుతాడు.

ఎక్కడినుంచో పోలీసులకు ఉప్పందితే తప్ప, అంత భయంకరమైన హత్య, ఒక ఇంటి గుట్టు, ఊరి పరువు ప్రతిష్ఠగానే మిగిలిపోతుంది. ప్రజల పేదరికాన్నే కాదు, మూఢనమ్మకాలనీ ఓట్ల రాజకీయాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మద్యం మత్తు కాకుంటే మరో మత్తు. జనాన్ని మానవ హక్కులు, నిజాయితీ, మహిళల సమానత్వం, మానవీయ విలువలు, అలాంటి అవగాహనకి ఎంత దూరంగా ఉంచితే అంతకాలం వాళ్ల ని ఓట్ల రాజకీయాలకి అవినీతికి అంత సులువుగా వాడుకోవచ్చు! ఈ సత్యా న్ని మాత్రం పంచాయితీ ప్రెసిడెంట్లు వారి వారి ప్రధాన రాజకీయ పార్టీ నేతల అడుగుజాడల్లో, వారి అండదండలతో ఆసాంతం అవగతం చేసుకుని, నిష్ఠగా అమలుపరుస్తున్నారు.

చాలా చోట్ల కుల సంఘాల నాయకులే ఊరి పెద్దలు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా. కుల సంఘాల నాయకులు తమ తమ కులాల సామాజిక న్యాయం కోసం పోరాడటం హర్షించాల్సిందే . అణచివేత, వివక్ష, హింస, దారిద్య్రం, దోపిడీ, హక్కుల హననం ఎక్కడున్నా ఎదిరించాల్సిందే! వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే, ఆయా పోరాటాల్ని ప్రజాస్వామ్య వాదులు ఎల్లప్పుడూ బలపరుస్తున్నారు. కాని ఈ కుల సంఘాల నాయకత్వాలకు కూడా ఓట్లు, సీట్లు, అధికారం చేజిక్కించుకోడానికే వ్యూహాలు ఎత్తుగడలు ఉంటున్నాయి తప్ప ఆయా కులాల్లో జరుగుతున్న బాల్య వివాహాలు, వరకట్న దాహాలు, హత్యలు, పరువు పేరుతో హత్యలు, మహిళలపై హింస, వివక్ష లాంటి దారుణాలను ఆయా కుల సంఘనాయకులు ఏనాడైనా పట్టించుకుని మాట్లాడారా? మాట్లాడరు.

రాజ్యాధికారం చేజిక్కే వరకు నోళ్ళు విప్పరు అని అనుకోవాలా? వారే గనక వారి కులాల్లో ఆడవాళ్ళ సమస్యల మీద న్యాయ బద్ధంగా మాట్లాడి, వారి వారి కులాల్ని ప్రభావితం చేసి ఉంటే ఇన్ని ఆడ శిశు హత్యలు, బాల్య వివాహాలు, వరకట్న హత్యలు జరిగి ఉండేవా? వారి వారి కుటుంబాల్లో ఆడపిల్లలకి, స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల్ని పట్టించుకోకుండా, వారి కులాలకి సామాజిక న్యాయం కోరే నాయకత్వాల నిజాయితీని శంకించకుండా ఎలా ఉండటం? ప్రధానంగా బాల్య వివాహా లు, కుటుంబ హింస, ఆడపిల్లల పట్ల వివక్ష ఎన్ని చట్టాలొచ్చినా ఎం తటి నిజాయితీగల పోలీసు ఆఫీసర్లు ఉన్నా చట్టం ఎంత పటిష్ఠంగా ఉన్నా సమస్యకు కొంత మాత్రమే ఉపశమనం.

కులసంఘాల నాయకులూ పంచాయతీ ప్రెసిడెంట్లు కులపెద్దలూ, బస్తీ నాయకు లూ బాధ్యులు కానంత కాలం స్త్రీలపై హింస పెరుగుతూనే ఉంటుంది. గ్రామాలలో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, బయటకురాని మహిళల హత్యలు ఎన్నో ఉన్నాయి. చాలా భాగం కేసులు తొక్కి పెట్టి ఉంచటంలో ఊరి ప్రెసిడెంట్, కుల పెద్దల పాత్ర అధికం. కొన్నిచోట్ల పోలీసులు కూడా, వీరిని ఎదిరించే సాహసం చేయరు. కుల సంఘాల నాయకులే పంచాయతీ ప్రెసిడెంట్లు అయినప్పుడు మరింతగా వారు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశముంది.

పంచాయతీలు గ్రామాల్లో రోడ్లు వేసుకుని, పూడికలు తీసుకుని, చెట్లు పెట్టించి, డబ్బులొచ్చే ప్రభుత్వ పథకాలని తెచ్చుకుని, బొక్కసం నింపుకుంటే సరిపోతుందా? ఆడవాళ్లు, పిల్లల పట్ల జరిగే హింస, వివక్షని ఎందుకు ఆపలేక పోతుంది? ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, గ్రామంలో నిస్వార్థ సుపరిపాలనకు నాంది పలకకుండా, తన రాజకీయ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటం గ్రామాల్లో అశాంతికి దారితీయక ఏమవుతుంది? ఈ దిశగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే. తమ తమ పంచాయతీ ప్రెసిడెంట్‌లను, అనుబంధ కుల సంఘాలను కేవలం గ్రామాల్లో ఓట్లు సమకూర్చే ప్రతినిధులుగా కాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని దాని స్ఫూర్తిని అందుబాటులోకి తెచ్చే నేతలుగా ఎదిగేలా సహాయపడాలి.
- అంకురం సుమిత్ర
వ్యాస రచయిత్రి, సామాజిక కార్యకర్త

Friday, May 4, 2012

హిందూరం?

Tirupati-Balaj 

వరస వెంట వ…రస తప్పులో కాలేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కేంద్రబిందువుగా మళ్లీ మొదలయిన మరో వివాదం ఆయనను చివరకు హిందూమతానికి వ్యతిరేకిగా ముద్రవేసే ప్రమాదం తెచ్చింది. బుధవారం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన జగన్‌, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందన్న డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న సరికొత్త వివాదానికి తెరలేపి నట్టయింది. గతంలో సాంకేతికంగా పార్శీ అయిన ఇందిరాగాంధీ, సిక్కు మతానికి చెంది న రాష్టప్రతి జ్ఞానీ జైల్‌సింగ్‌ కూడా తిరుమలలో డిక్లరేషన్‌ ఇచ్చారు. అదేవిధంగా జగన్‌ కూడా తిరుమలలో డిక్లరేషన్‌ ఇస్తారని భావించారు.

కానీ ఆయన అందుకు తిరస్కరించి, వైఎస్‌ గతంలో ఎప్పుడూ డిక్లరేషన్‌ ఇవ్వలేదని, పైగా స్వామివారికిపట్టు వసా్తల్రు కూడా సమర్పించారని వాదించారు. అదేవిధంగా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఏనాడూ డిక్లరేషన్‌ ఇవ్వనప్పుడు తానెందుకు ఇవ్వాలని అధికారులను ప్రశ్నించారు. దానితోపాటు అనుచరులు చేసిన నినాదాల హడావిడి భక్తులను చికాకు పరిచింది. జగన్‌ తనది సోనియాగాంధీ స్థాయి అని చెప్పుకోవడాన్ని అటుంచితే, తనకు హిందు మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే ఏమవుతుందని హిందు మత సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. చాలాకాలం నుంచి జగన్‌ను క్రైస్తవుడిగానే భావిస్తామని, ఆయన కుటుంబ సంప్ర దాయాలు క్రైస్తవమతానికి సంబంధినవే కాబట్టి జగన్‌ను రెడ్డిగా పరిగణించబోమని సీనియర్‌ నేతలు జెసి దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డి బాహాటంగానే వాదిస్తూ వస్తున్నా రు.

ఈ నేపథ్యంలో వారి విమర్శలకు తెరదించేందుకయినా జగన్‌ తనకు హిందూ మత విశ్వాసాలపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే బాగుండేదని హిందూ ధార్మిక సంస్థలు వాదిస్తున్నాయి. ఇప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వలేదు కాబట్టి ఆయనను హిందువులంతా క్రైస్తవుడిగానే భావించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ జీవించినప్పుడు ఏడు కొండలను రెండు కొండలకు పరిమితం చేసేందుకు ప్రయత్నించి, ఆ మేరకు ఒక జీఓ కూడా ఇవ్వడం ఇప్పుడు జగన్‌ చర్య ద్వారా మళ్లీ చర్చనీయాంశమయింది. శ్రీ వెంకటేశ్వరుడి పరిధిని ఏడు కొండల నుంచి రెండు కొండలకు కుదించి, అక్కడ జగన్‌ బావ బ్రదర్‌ అనిల్‌ సారధ్యంలో తొలుత ఒక పెద్ద చర్చి నిర్మించి, ఆ తర్వాత అక్కడ వ్యాపార కేంద్రం నిర్మించాలని ప్రయత్నించిన వైనంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికిన విషయం తెలిసిందే.

YSR-Cong-Flag 

వైఎస్‌ ప్రయత్నాలను వ్యతిరేకించిన నాటి ఒక సీనియర్‌ మంత్రి రాత్రికి రాత్రే చంద్రబాబునాయుడుకు ఫోన్‌ చేసి తిరుమలను మీరే కాపాడాలని అభ్యర్ధించారు. తర్వాత టీడీపీ తన ఆందోళన ద్వారా రెండుకొండలకు కుదించే వైఎస్‌ ప్రయత్నాలను అడ్డుకోవడం తెలిసిందే. తాజా పరిణామాలు జగన్‌ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారన్న భావన హిందూ వర్గంలో మొదలయింది. నైవేద్యం గంట కొట్టకముందే జగన్‌ వైకుంఠం నుంచి ఆలయంలోకి వచ్చి రంగనాయక మంటపంలో కూర్చోవడాన్ని హిందూ మతస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని ద్వారా ఆయన నైవేద్యాన్ని కూడా అపవిత్రం, అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వారి వెంట కార్యకర్తలు, అనుచరులు సహజంగా వస్తుంటారని..

ఈ విషయంలో జగన్‌ను తప్పు పట్టవలసిన పనిలేదంటున్నారు. అయితే జగన్‌తో వచ్చిన అనుచరులు ఆయనకు జిందాబాదులు కొట్టడం స్వామిని అవమానించడమేనని స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప, అన్యుల కీర్తన సంప్రదాయా నికి, మతానికి విరుద్ధమని గుర్తు చేస్దున్నారు. కాగా జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని వైకాపా నేతల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వివాదాలు మంచివి కాదంటున్నారు. మతం చాలా ప్రమాదకరమైన అంశమని, దానితో ఆడుకుంటే కష్టాలు కోరితెచ్చుకోవడమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఒకవేళ జగన్‌ తమ నేత జగన్‌ అంతా అనుకున్నట్లు క్రైస్తవుడే అయినప్పటికీ తనకు హిందూ మత విశ్వాసాలపై గౌరవం ఉందని డిక్లరేషన్‌ ఇస్తే హిందువుల్లోనూ ఆయనపై గౌరవం, అభిమానం పెరిగేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ అధికారులు మూడుసార్లు కోరినా డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో.. జగన్‌ తనను తాను క్రైస్తవుడినని అంగీకరించినట్టయిందని, దానివల్ల పార్టీ హిందువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీల నిరసనలు
తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతోంది. శాసనసభలో టీడీపీ సభాపక్ష నేత దాడి వీరభద్రరావు హిందూ మత సంప్రదాయాలు, సంస్కృతిని జగన్‌ అవమానించారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వకుండా దౌర్జన్యంగా లోపలికి వెళ్లడం హిందువులను అవమానించడమేనని, ఇది హిందువుల మనోభావాలను అగౌరవపరచడమేనని స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ తిరుమల నిధులను తన నియోజకవర్గానికి తరలించారని, ఇప్పుడు జగన్‌ దృష్టి తిరుమలపై పడిందని, ఇకపై ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుమలను నాలుగుసార్లు దర్శించుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ డిక్లరేషన్‌పై సంతకం చేశారని, గతంలో ఇందిరాగాంధీ కోరి మరీ డిక్లరేషన్‌పై సంతకాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. సోనియా నాలుగుసార్లు వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేశారని పీసీసీ ఉపాధ్యక్షుడు నరేష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ హిందువులను అవమానించారన్నారు. అటు బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం చేసి ఉండాల్సిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ స్పష్టం చేయగా, టీటీడీ మూడుసార్లు కోరినా జగన్‌ సంతకం పెట్టకపోవడం ఏమిటని, ఒక సంతకం పెడితే పోయేదేముందని బీజేపీ నేత సామంచి శ్రీనివాస్‌ ప్రశ్నించారు.


- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్

కాపు కాస్తున్నాయ్‌!

kapu 
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలపై అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నేశాయి. సీమాం ధ్రలో ప్రధాన సామాజిక వర్గమైన కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ దన్ను కోసం మూడు పార్టీలూ పరితపిస్తు న్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన సాగుతోన్న రెడ్డి సామాజికవర్గం జగన్‌ వైపు వెళుతోందన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం వారికి ప్రత్యామ్నాయంగా అంతకంటే మూడింతల సంఖ్యాబలం ఉన్న కాపు, బలిజలకు చేరువయేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి కాపు-బలిజను దువ్వే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ తర్వాత బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి కూడా ఇచ్చి రాయలసీమలో బలిజలకు చేరువయింది. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధి కంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న కాపులకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా పావులు కదుపుతోంది. రాయలసీమలో కడప, చిత్తూరులో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న బలిజలకు చేరువయేందుకు ఆయా కుల నేతలను ప్రోత్సహిస్తోంది. నెల్లూరులో కూడా బలిజల హవా ఎక్కువే. తాజా ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం కాపులకు, తిరుపతి బీసీ బలిజలకు ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వం ఆ ప్రయోజనాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో పొందాలని భావిస్తోంది. ఇక చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.

అందుకే కాపు, బలిజ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవిని ప్రచారంలోకి దింపాలని నిర్ణయించింది. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లా, ప్రధానంగా విజయవాడ నగరంలో దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయడు వంగవీటి రాధా ఇటీవల వైకాపా తీర్ధం తీసుకోవడంతో కలవరపడిన కాంగ్రెస్‌.. ఆయనతో పాటు కాపులు చేజారకుండా ఉండేందుకు ఆ వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. అందులో భాగంగా యాదవ వర్గానికి చెందిన మంత్రి పార్ధసారథి ఇటీవల కాపు నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాపులు కాంగ్రెస్‌లోనే ఉంటారని, రాధా పార్టీ మారినప్పటికీ ఎన్నాళ్ల నుంచో రంగాతో ఉన్న కాపులు మాత్రం జగన్‌ పార్టీలో చేరరని పార్ధసారథి సమక్షంలోనే కాపు నేతలు భరోసా ఇచ్చారు. కాపులంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

చిరంజీవికి పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తోందని గుర్తు చేశారు. కోస్తాలో కాపులు జగన్‌ వైపు వెళ్లకుండా నిరోధించడంతో పాటు, తన వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్‌ తన ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కాపు-బలిజ వర్గంపై కన్నేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు తనతో కొనసాగిన కాపు-బలిజ సామాజికవర్గాన్ని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరని ఆ సామాజికవర్గాన్ని దరిచేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా, రాయలసీమలో రాజంపేట, రాయచోటి, తిరుపతిలో బలిజ తూర్పు గోదావరిలో రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాపులకు, అనంతపురంలో అనంతపురం అర్బన్‌లో బలిజకు అవకాశం ఇచ్చారు. ఆ మేరకు కాపు-బలిజ సంఘ నేతలు బాబును అనంతపురంలో కలసి తమ వర్గానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ వర్గానికి చెందిన అభ్యర్ధులను గెలిపించుకోవడంతో పాటు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. సీమలో మొదటి నుంచీ టీడీపీకి బలిజలు సంప్రదాయ ఓటు బ్యాంకుగానే ఉన్నారు. కోస్తాలో కాపులు పూర్తి స్దాయిలో లేనప్పటికీ కాంగ్రెస్‌-టీడీపీకి చెరిసగం మద్దతునిచ్చేవారు. చిరు పార్టీ పెట్టిన తర్వాత ఆ సమీకరణలో మార్పు వచ్చిన నేపథ్యంలో, తిరిగి ఆ సామాజికవర్గాల ఓటు బ్యాంకు కోసం టీడీపీ వ్యూహరచన చేయడంతో పాటు, దానిని కార్యాచరణలో పెట్టింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాపులను దువ్వే పనిలో ఉంది. విజయవాడలో వంగవీటి రాధా చేరికతో ఆ ప్రాంతంలో కాపులకు చేరువ కావాలని యోచిస్తోంది.

తూర్పు గోదావరిలో ఇప్పటికే జ్యోతుల నెహ్రు వంటి కాపు నేతలు పార్టీలో ఉన్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు చాలామంది జగన్‌ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ పద్మనాభం వంటి అగ్రనేత కూడా జగన్‌తో కలసి నడిచారు. అయితే జగన్‌ ఒంటెత్తు పోకడలు, వన్‌మ్యాన్‌షో నచ్చని ముద్రగడ వైకాపా నుంచి పక్కకు తప్పుకున్నారు. చిరంజీవి, చంద్రబాబునాయుడు ఆ రెండు జిల్లాల్లో కాపులపై దృష్టి సారిస్తుండటంతో జగన్‌ వైపు వచ్చేవారు తక్కువయిపోతున్నారు. కానీ, కోస్తాలో కాపులను ప్రోత్సహించడం ద్వారా అధికారంలోకి సులభంగా రావచ్చని జగన్‌ అంచనా వేస్తున్నారు.
- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌

Sunday, January 22, 2012

* డా. మైసూరారెడ్డి - Inner View

 http://www.tv5news.in/en/politics/photos/2549/mysura.jpg
మైసూరమ్మ మీదుగా మైసూరారెడ్డి
మైసూరారెడ్డిని బాగా ఎరిగినవాళ్లతో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం కొంత అర్థమవుతుంది. ఆయనకు జనాన్ని ఆకర్షించేంతటి వాగ్దాటి లేకపోయినా, సబ్జెక్టును స్టడీ చేసి మెప్పించే ఓపిక ఉంది. ఈగోయిస్ట్‌గా కనబడినా, ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో ఉన్నా ‘రాజకీయం’ చేయరు. ఫ్యాక్షన్ గొడవలకు దూరం పాటిస్తారు. పైగా సెన్సిటివ్. అందువల్లే ఆయన గౌరవనీయ నాయకుడయ్యారు. అయితే ఈ లక్షణాలే ఆయన్ని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా చేశాయా? ‘ఎక్కడో పల్లెటూళ్లో పుట్టి, ఈ స్టేజ్‌కు వచ్చినాము కదా, ఇది చాలదా!’ అంటారు. 
  కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరా ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి 2004లో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే...http://desiboost.com/telugu/wp-content/uploads/2011/04/mysoora-reddy-300x267.jpg
 
మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి మా అబ్బ నిడిజివ్వికి ఇల్లటం వచ్చినాడు. మా వూల్లల్లో తండ్రి తండ్రిని అబ్బ అంటాము. తల్లి తండ్రిని తాత అంటాము. మా తండ్రి చనిపోయేంతవరకు అన్‌అపోజ్డ్‌గా గ్రామ సర్పంచిగా చేసినాడు. మా అమ్మ అన్నగారు(మాజీ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ ఊటుకూరి రామిరెడ్డ్డి) కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చినాడు. అలా మొదట్నుంచీ రాజకీయాలతో సంబంధాలుండేవి.

ప్రొద్దుటూరు దగ్గర తాళమాపురం అనే ఊరుంది. అక్కడ ఉన్న గ్రామదేవత మైసూరమ్మ. అందుకే మైసూరయ్య, మైసూరప్ప, మైసూరమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు మీదనే నాకూ మైసూరారెడ్డి అని పెట్టినారు. మానాన్న కూడా బాలమైసూరారెడ్డి. బయటి ప్రాంతాల్లో ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదో మైసూరు ఉంది కదా, అదేమో అనుకుంటారు.


మేము నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు చెల్లెళ్లు. అందర్ల్లోకీ నేనే పెద్దోణ్ని. నిడిజివ్విలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల స్కూలు. గొప్పలకు ఎందుకు పోవాల? యావరేజ్ స్టూడెంట్‌నే. తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివిన. అప్పట్లో దాన్ని డబ్బా రేకుల కాలేజీ అనేవాళ్లు.



 












 
ఫీజులేని డాక్టరుగా...
మా కుటుంబంలోగానీ, మా బంధువుల్లోగానీ ఎవరూ పెద్ద చదువు చదివింది లేదు. మా తండ్రి కోరిక ఏమంటే నేను డాక్టర్ చదవాలని. ఎంబీబీఎస్ డొనేషన్ కోసం లెక్క కూడా కూడబెట్టినాడు. గుల్బర్గాలో అయితే ఐదువేలు, కాకినాడలో అయితే పదివేలు. అయితే నాకు 82 శాతం మెరిట్ మీదనే కర్నూలు కాలేజీలో సీటు వచ్చినాది.

హౌస్ సర్జెన్సీ అయిపోతానే ఐదు సంవత్సరాలు ఎర్రగుంట్లలో ప్రాక్టీస్ చేసినాను. పరీక్ష చేయిచ్చడమూ, వాళ్లకు కావాల్సిన మందులో, ఇంజెక్షన్లో రాయిచ్చడమో చేసేవాణ్ని. కన్సల్టేషన్ ఫీజు తీసుకునేది లేదు. మొదట్నుంచీ ఉన్నోళ్లమే కాబట్టి, వాళ్లిచ్చే రెండ్రూపాయలో, మూడ్రూపాయలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది నాకు కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రాక్టీస్ మానేసినాను. కొందరైతే సలహా గూడా ఇచ్చినారు, ‘రోజూ ఓ గంటన్నా ప్రాక్టీస్ చేయగూడదా’ అని. న్యాయవాది రాజకీయాల్లో ఉన్నాగని ఫరవాలేదు. డాక్టర్‌కు ఏడ కుదురుతుంది? క్లైంట్ వెయిట్ చేస్తాడుగానీ పేషెంట్ ఆగలేడు కదా!


పుస్తకం చదువుకుని బాధ్యతలు తెలుసుకున్నా...

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కాబట్టి, మెడికల్ కాలేజీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉంటి. తండ్రి చనిపోయిన తర్వాత ఊరికి సర్పంచ్‌గా చేసినాను. తర్వాత కమలాపురం సమితి అధ్యక్షుడిగా పదివేల ఓట్లతో గెలిచినా(1981-85). అప్పుడు నాకు 32 ఏళ్లు. చిన్నవయసుగదా ఏం చేస్తాడో, ఎట్ల చేస్తాడో అని అందరికీ అనుమానముండె.

స్థానిక సంస్థల విధులేమిటి, ప్రెసిడెంటుగా ఏం చెయ్యాలి, అని రూల్స్ బుక్కు తీసుకోని చదివి, ఫస్ట్ మీటింగుకు పోతనే అధికారులతో మాట్లాడినా. అందులో ఉన్న బాధ్యతల ప్రకారం రివ్యూ చేసి, ‘ఫలానా చోట ఉంది చూసుకోలేదా?’ అనంగనే, ‘ఓయమ్మ ఈయన అసాధ్యుడే’ అనుకున్నారు. గ్రామాల్లో తిరగటం, మట్టిరోడ్లు వేయించటం, చదువు చెప్తాండారా లేదా అని స్కూళ్లు ఇన్‌స్పెక్ట్ చేయడం... అట్ల మంచిపేరే వచ్చింది.


స్టేజ్ ఫియర్‌తోనే రాయలసీమ ఉద్యమంలోకి...

ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వం తెలుగుగంగ పనులు మొదలుపెట్టింది. తెలుగుగంగ పేరు మీద నెల్లూరుకు, మద్రాసుకు దొంగదారిన నీళ్లు పోతాయి, రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయం మొదలైంది. ‘రాయలసీమ విమోచన సమితి’ అని మొదలుపెట్టి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, లక్కిరెడ్డిపల్లె రాజగోపాలరెడ్డి, బద్వేలు వీరారెడ్డి రాయలసీమంతా పర్యటిస్తాన్నరు(కొంతకాలానికి రా.వి.స. ఆగిపోయింది. తర్వాత రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి బలం పుంజుకుంది).

ఎన్.శివరామిరెడ్డి, ఎన్.సి.గంగిరెడ్డి, మాసీమ రాజగోపాలరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు, అందులో సీపీఐ, కాంగ్రెస్, అన్ని పార్టీలవాళ్లున్నరు. ‘యువకుడు కదా, ఓపిగ్గా తిరుగుతాడు, అఖిలపక్షం కన్వీనర్‌గా మైసూరారెడ్డిని పెడదాం’ అని పెద్దవాళ్లంతా నిర్ణయించినారు. అయితే నాకు స్టేజ్ ఫియరుండేది. ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అరగంట ఆలోచించి ప్రిపేర్ అయ్యేవాణ్ని. తర్వాత స్టేజి మీద మాట్లాడడం అలవాటయ్యింది.


పోతిరెడ్డిపాడు సామర్థ్యం పదివేల క్యూసెక్కులు పెట్టినారు. దాని సామర్థ్యం పెంచాలనేది ప్రధాన డిమాండు. తర్వాత శ్రీశైలం కుడికాలువ చిత్తూరు జిల్లాకు పొడిగించాలనీ, ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, కృష్ణానది నికర జలాల్లో వాటా కావాలనీ, రేణిగుంట నుంచి గుంతకల్లుకు రైల్వే డబ్లింగ్ లైన్ కావాలనీ, కడప ఆకాశవాణిని అభివృద్ధి చేయాలనీ, థర్మల్ స్టేషన్ కావాలనీ డిమాండ్లు పెరిగిపోయినాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం కోరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నొక్కి చెబుతున్నా... రాష్ట్రంలో ఉంటూనే అభివృద్ధి కావాలనుకున్నాం.


పాదయాత్రలు ఎట్ల జేస్తారు?

ఉద్యమంలో భాగంగా రాయలసీమ ఉద్యోగుల సంఘాలతో కలిసినాం. యూనివర్సిటీ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థులను కూడగట్టినాం. పత్రికల ఎడిటర్లను కలిసి సమస్యలు ఏమిటో వివరించినాం. నాలుగు జిల్లాల్లో ధర్నాలు చేసినం. సభలు జరిపినం. అయితే డిమాండ్లను ఎట్ల ప్రజల్లోకి తీసుకొనిపోవాల? పాదయాత్ర చేస్తే గ్రామగ్రామాన చెప్పొచ్చు కదాని ఆలోచించినాం.


మరి పాదయాత్రలు ఎట్లా జేస్తారు? ఏదో మఠాధిపతులు చేయడము చూసినాముగానీ రాజకీయ నాయకులు పాదయాత్ర ఏరకంగా చేస్తారో తెలీదు కదా! గాంధీజీ దండి సత్యాగ్రహం బుక్కు గూడా సంపాదించి చదివినా. ఏయే ఊర్లున్నాయి, ఎట్ల నడవాలి, ఎక్కడ ఆగాలి అని ప్లాన్ వేసినాం. తిరుపతి నుంచి కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా పోతిరెడ్డిపాడు వెళ్లాలని ఐడియా. ఇదే వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పినాం. ఎంవీ రమణారెడ్డి కూడా మంచి ఆలోచనే అన్నాడు. అప్పుడింకో సమస్యొచ్చింది. ఇంతమంది నాయకులు ఎట్ల వెళ్లడం?


అందుకే మరో ఆలోచన జేసి, తిరుపతి(నేను), లేపాక్షి(వైఎస్), కళ్యాణదుర్గం(రమణారెడ్డి), ఆదోని(రఘునాథరెడ్డి), కదిరి(సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి) నుంచి ప్రారంభమయ్యేట్టుగా ఐదు గ్రూపులు చేసినాం.
అన్ని గ్రూపులూ నంద్యాలలో కలిసి ఆడనుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్లాలనేది ఆలోచన. అదే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు నాంది అని చెప్పుకోవచ్చు. రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. ఒకరోజు 18 రావొచ్చు, ఒకరోజు 22 రావొచ్చు, కాని మొత్తంగా 420 కిలోమీటర్లను 22 రోజుల్లో పూర్తిచేయాలి.

వెంబడి టెంట్లు, భోజనాలు ఇలా ఏమీ తీసుకెళ్లింది లేదు. కొంచెం పెద్ద గ్రామం చూసుకోవడం, అక్కడే గ్రామస్తులు వండిపెట్టిన పులగమన్నమో, పప్పో తినడం, బడి లాంటిది చూసుకుని పడుకోవడం... వెళ్తూ గ్రామస్తులకు సమస్యలు అర్థమయ్యేట్టు జెప్పడం... దీంతో రాయలసీమ ఉద్యమానికి ఒక ఊపొచ్చింది. తర్వాత వివిధ దశల్లో, వివిధ ప్రభుత్వాల్లో మేము పెట్టిన డిమాండ్లు చాలామట్టుకు పూర్తవుతూ వచ్చినై.

http://www.thehindu.com/multimedia/dynamic/00114/HY10MYSOORA_REDDY_114968e.jpg
బొక్కల దవాఖాన
సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలైంది. అది సహజంగానే రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. అందువల్లే కమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నిక సేఫ్ ల్యాండింగ్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ హవా ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి సీతారామయ్య మీద 35,000 మెజారిటీతో గెలిచినాను(1985).

పాత బిల్డింగులో శాసనసభ మొదటి సమావేశం. బీజేపీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతున్నాడు. నిజాం ఆర్థొపెడిక్ హాస్పిటల్ గురించిన అంశం అనుకుంటా. బొక్కల దవాఖాన అన్నాడు. ఇదేంది బొక్కలు అంటాండడు అనుకున్నా. ‘ఏంది ఇంద్రసేన్ ఏదో బొక్కలు అంటివి?’ అని అడిగితి. ‘బొక్కలు బొక్కలు అవే బోన్స్’ అన్నాడు. ఓహో, శాసనసభలో మన భాష మనం మాట్లాడుకోవచ్చు!


రాయలసీమ భాషంటే జంకూగొంకు ఉండే. ఉంటాదిగదా! అప్పట్నుంచీ భాష ఏం మాట్లాడతాండరు అని ఎప్పుడూ ప్రాధాన్యం ఇయ్యలే. వాళ్లు మాట్లాడేదాంట్లో సబ్జెక్టుందా లేదా ఇదే చూస్తాంటి. తర్వాత మైసూరారెడ్డి మాట్లాడితే సామెతలు, పిట్టకథలు చెబుతాడని నా భాష కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు ఏదైనా కొత్త అంశం మాట్లాడగలమా? అని ఆలోచన జేస్తా. ఒకసారి రాజ్యసభలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది.


అందులో అస్సెట్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నింది. ఏందిరా అనంటే హైకోర్టు జడ్జీలు, కిందిస్థాయి జడ్జీలు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తేమో రాష్ట్రపతికిస్తాడు. ఇవన్నీ ఎలా ఇస్తారు? సీల్డు కవర్లలో! అందరూ సీల్డు కవర్లలో ఇస్తే ఇంగేంటికి? ఇంట్లో బీరువాలో పెడితే పోతాదిగదా అని పాయింట్ లేవనెత్తినాను. దాంతో బిల్లు వెనక్కిపోయింది. అప్పుడు బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ‘రెడ్డీ, హౌ డిడ్ యు గెట్ దట్ పాయింట్? అర్ యు యాన్ అడ్వొకేట్ ఆర్ వాట్?’ అన్నారు.

http://www.aircargonews.com/FT10/Mysoora-Reddy.gif
చీటీలో మంత్రిపదవి
అప్పుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కాకి మాధవరావు ఆయన పర్సనల్ సెక్రటరీ. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రాజభవన్‌లో ప్రమాణస్వీకారం అయిపోయి, గ్రూప్‌ఫొటో అయిపోతానే, ‘పోండి, మీ పోర్టుఫోలియోస్ ఆ రూములో ఉన్నాయి చూసుకోపోండి’ అన్నాడు మాధవరావు. వినూత్నంగా ఉండాలని వాళ్లు రాత్రే చీటీల్లో రాసిపెట్టినారు. ఆ రూములో కొంచెం లైటింగ్ తక్కువుంది. చూస్తే హోమ్ అని ఇంగ్లీషులో నాలుగక్షరాలే కనపడినాయి.

బయటికి వస్తానే చెంగారెడ్డి, అడ్వకేట్‌గదా, ‘ఏమయ్యా హోంమంత్రీ, సీఆర్‌పీఎఫ్ తెలుసునా, ఐపీఎస్ తెలుసునా’ అనే. యాదో తెలిసినకాడికి తెలుసులే, లేకపోతే వాళ్లే నేర్పిస్తారుగదాంటి. (లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి) అప్పటికి అది అంత ప్రాధాన్యత గల శాఖ కాదు. మావాళ్లంతా గూడా ఇదేంటికి, చిన్న శాఖైనా సరే ఇంకేదైనా మార్పించుకో అన్నారు. సర్లేబ్బా ఏదో ఇచ్చినారు, దాన్నే మెప్పించేట్టు పనిచేసుకుందాం అంటి.


నేదురుమల్లి నన్ను హోం మినిస్టర్‌గా ఎంపిక చేయడమే కాకుండా, ఫ్రీహ్యాండ్ ఇచ్చినాడు. నిజాయితీపరున్నని ఆయనకు ప్రత్యేక అభిమానం. అప్పుడు ఐజీ(లా అండ్ ఆర్డర్) వీరనారాయణరెడ్డి ఉండే. దూరపు బంధువు గూడా. ఏదో మీటింగ్ అయిపోయాక చనువుకొద్దీ
‘హోంమంత్రి అయినావుగదా, రాయలసీమ ఆందోళనలో నిన్ను చిత్తూరులో లాకప్‌లో ఏసి కొట్టినాడుగదా, ఆయన గుర్తున్నాడా? ఆయనదేమైనా పనివుంటే జేస్తావా?’ అన్నాడు. రూల్స్ ప్రకారముంటే ఆయనకొచ్చేది ఆయనకిద్దామంటి. ఆయన ప్రమోషన్ పెండింగులో ఉండే. ఓకే చేస్తి. దాంతో నేనేదైనా నార్మ్స్ ప్రకారం చేస్తానని పోలీసుల్లో అభిమానం పెరిగింది.

అట్లనే అప్పుడు నక్సల్స్ యాక్టివిటీస్ ఎక్కువ. ల్యాండ్‌మైన్స్‌లో పోలీసులు చనిపోతాండిరి. దాంతో పోలీసుల్లో భయం ఉంటుండె. చనిపోయినా వాళ్ల శాలరీ కంటిన్యూ అయ్యేట్టుగా నిర్ణయం తీసుకుంటిమి. అలాగే ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటే ఆ ప్రమోషన్ శాలరీ ఇచ్చేది. రిటైర్ అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేట్టు చేస్తిమి. ప్రాణం ఇవ్వలేముగాని ఉద్యోగ భద్రత కల్పించినాం. దాంతో పోలీసుశాఖలో గౌరవం పెరిగింది. ఈ విధానాన్నే తర్వాత కేంద్రం ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో అమలుచేస్తోంది.

















వైఎస్ నన్ను ‘డాక్టర్’ అని సంబోధించేవారు
రాజశేఖరరెడ్డిని నేను ‘సార్’ అనీ, ‘ఏమండీ’ అనీ పిలిచేవాణ్ని, ఆయన నన్ను ‘డాక్టర్’ అని పలకరించేవారు. కడపలో అందరమూ కాంగ్రెస్‌వాళ్లమే అయినా కందుల ఓబుల్‌రెడ్డిది ఒక వర్గం. బద్వేలు శివరామకృష్ణయ్య, రఘురామిరెడ్డి, నేను... మేమంతా వైఎస్ వర్గం. అయితే 1989,90 ప్రాంతం నుంచి నాకూ, వైఎస్‌కూ కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది.

అయినాగూడా వైఎస్ నా రెండో కుమారుడి పెళ్లికి వచ్చినాడు. ఒకసారి అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒకే ఫ్లైట్‌లో వస్తుంటే కలిసినాము. కరువు ప్రాంతాలకోసం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. నేను పశువుల గడ్డి, తాగునీరుకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పాను. అదే అనుకుంటా ఆయన్తో చివరిసారి మాట్లాడటం.


ఎదుగుదలకు పరిమితి ఏముంది?

కొన్ని కారణాల వల్ల నేను 2004లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లాను. అక్కడ కూడా నా గౌరవం నాకుంది. పార్టీనుంచే గదా రాజ్యసభకు వెళ్లాను. గల్లీనుంచి ఢిల్లీస్థాయిలో పేరు తెచ్చుకోవడానికి పార్టీ అవకాశం ఇచ్చిందిగదా!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiQ4aHsGyMVVD0OCuK17KsRZnmXnYKxnSTWlQUVRQId3aUIh7pEJ79RjUj_ZatjrVNrEBh6Dz2XIbhbEKtNsOx_tpfIE-3NcJCigH2UaZETxTaCqSEXbrCySRV_PDbWzMD1NjfID-96LCw/s1600/newspics+mysoora+babu.JPG
రాజకీయాల్లో ఎదుగుదలకు పరిమితి అంటూ ఏముంది? ఎంతైనా ఎదగొచ్చు. నేను ఎదగాల్సినంతగా ఎదిగానా అన్నదికాదుగానీ నాకైతే ఏ రకంగానూ అసంతృప్తి లేదు. పరిస్థితులు, ప్రభావాలవల్ల కొందరు కొన్నిసార్లు ముఖ్యమంత్రులు కూడా అయినారు. నసీబ్ అంటారు కదా అది కూడా ఉండాలి. నిబంధనలకు లోబడి నేను ఏం చేయగలనో అది చేయడానికే ప్రయత్నించినాను. ఏనాడూ ఏడ్చిందీ లేదు, అయ్యో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఒకరిని బాధపెట్టినామే అనుకున్నదీ లేదు. వాళ్లెవరో అంత ఎదిగినారు అని కాకుండా, రైతు కుటుంబంలో పుట్టి ఇంతదాకా వచ్చినాము కదా అనుకుంటాండ.

ప్రొఫైల్...

పూర్తి పేరు : మూలె వెంకట మైసూరారెడ్డి
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, బాల మైసూరారెడ్డి
జన్మదినం : 28.2.1949
జన్మస్థలం : కడప జిల్లా నిడిజివ్వి
వృత్తి : కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు.
భార్య : స్వరూప
పిల్లలు : ఇద్దరు కుమారులు; హర్షవర్ధన్‌రెడ్డి, రఘుకార్తీక్‌రెడ్డి (ఒకరు ఇంజినీరింగ్, మరొకరు డిగ్రీ చదివారు. మైనింగ్ బిజినెస్‌లో ఉన్నారు.)
నియోజకవర్గం : కమలాపురం
ఎమ్మెల్యే : 1985-94; 1999-2004
హోం, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ : 1990-94
సందర్శించిన దేశాలు : చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.
ప్రస్తుతం : 2006 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడు

సైడ్‌లైట్
ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో మైసూరా రెండున్నరేళ్ల మనవడు శ్రీతన్ ‘అబ్బా’ అంటూ వచ్చి, ఆయన ఒళ్లో కూర్చున్నాడు. ‘ఇదేం పేరు సర్?’ అంటే, ఇప్పుడందరికీ యాడలేని పేరుగావాలిగదా, అని నవ్వారు. వెంకటేశ్వరస్వామికి ఇదో పేరని తర్వాత చెప్పారు.

పర్సనల్ ట్రివియా...


విద్యార్థి దశలో సినిమాలు అవీ చూసేవాణ్ని. పేక కూడా బాగా ఆడేవాణ్ని. రాజకీయాల్లోకి వచ్చాక రెండూ పోయాయి.

నచ్చే నాయకుడిగా గాంధీజీ పేరే చెబుతాను. ఆయనకున్న దూరదృష్టి సామాన్యమైనది కాదు.
పుస్తకాలు చదువుతానుగానీ సాహిత్యాభిలషతో కాదు. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేవే చదువుతాను.
గాడ్‌ఫాదర్లంటూ ఎవరూ లేరు, సంఘటనలే నన్ను మలిచాయి.
మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అంతకుముందు మా కుటుంబాలకు బంధుత్వం ఏమీ లేదు. అమ్మాయిని చూశా, నచ్చింది, చేసుకున్నా.
ఏ భర్తకైనా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లకైతే భార్య సహకారం తప్పనిసరి. ఇంట్లో రొద ఉంటే, బయట ఎలా తిరుగుతాం? ఆ విషయంలో ఆమె పూర్తి సహకారం అందించింది.
ఇద్దరబ్బాయిలకూ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కనబడటం లేదు. నేనూ వారిని బలవంతపెట్టి తేవాలని అనుకోవట్లేదు.
ఎక్కడ పుట్టినానో, ఎక్కడ పెరిగినానో అక్కడ ఇప్పటికీ మాకు ఇల్లుంది. జిల్లాకు పోతే ఇప్పటికీ రాత్రికి ఊర్లోనే ఉంటాను.
నేను ఆస్తికుడినీ కాదు, నాస్తికుడినీ కాదు. ఇంట్లోవాళ్లు మాత్రం పూజలవీ చేసుకుంటాంటరు.
విదేశాల్లో ఏదో గొప్ప అభివృద్ధి జరుగుతుందన్న భ్రమ నాకు లేదు. చైనాలో అవినీతి లేదంటారుగానీ నాకు అక్కడే ఎక్కువ ఉన్నట్టు కనబడింది.
అన్నివేళలా నాకు అండగావుండే బంధువులు, మిత్రులే నా బలం. 

- సాక్షి Daily

Saturday, January 14, 2012

పందెం పోరులో రాజకీయ పుంజులు

 

కొక్కొరొ... కొ.. అంటే కొట్లాట
పందెం పోరులో రాజకీయ పుంజులు
ఓట్లు బెట్ కాస్తూ జనం ముందుకు
పొలిటి'కోళ్లు' 

ప్రత్యర్థులపై విచ్చు కత్తులు
తమలో తామే 'కూల్చే ఎత్తులు'
కాంగ్రెస్ బరిలో అనేక కోళ్లు
టీడీపీ, టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ఫైట్
ఎన్నికలు రాక ముందే బరిలోకి
కళ్లలో కసి... కదలికలో వ్యూహం... కత్తిగట్టిన కాలిదెబ్బ... అబ్బో! బరిలో దిగిన పందెం కోళ్ల పౌరుషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. సంక్రాంతి అంటేనే కొ... క్కొ...క్కొరోకో... కోళ్ల పందేలు! ఇది ఏడాదికో పండగ! కానీ... రాజకీయ పందెం కోళ్లకు నిత్యం సంక్రాంతే! చాన్స్ చిక్కిందంటే... కొట్టుకోవడమే! ఈకలు పీక్కోవడమే! ఈ పొలిటికల్ కోళ్లు ప్రత్యర్థి కోళ్లపై విరుచుకుపడుతుంటాయి. మైకులు పట్టుకు నమిలేస్తుంటాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పందెం కోళ్లు ఒకదానిపై ఒకటి మీదపడి రక్కేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ కోళ్లు కూడా కాలి వేళ్లకు కత్తులు కట్టుకుని ఎగురుతుంటాయి. ఇలా పార్టీల మధ్య జరిగే పందేలు ఒకవైపు... ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం కొట్టుకునే కోళ్లు మరో వైపు! మొదటిరకం పందేలు అందరికీ తెలిసినవే. రెండో రకం కోళ్ల పందేలు మాత్రం తెరవెనుక జరుగుతుంటాయి. ఈ కోళ్లు అదను చూసుకుని 'కత్తి గోరు' విసిరేందుకు వేచి చూస్తుంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా... అన్ని పార్టీల్లోనూ ఈ కుమ్ములాటల కోళ్లు ఉన్నాయి. ఇక చూసుకోండి వాటి రక్కిసలాట...

కాంగ్రెస్‌లో ఎన్నెన్ని కోళ్లో..
ఎక్కడైనా, ఏ బరిలోనైనా ఒక బరిలో, ఒకే సమయంలో రెండు కోళ్లే కొట్టుకుంటాయి. కానీ... కాంగ్రెస్ బరి తరీఖానే వేరు. ఒకేసారి ఆరేడు కోళ్లు బరిలోకి దిగి కీచులాడుకుంటాయి. ఒకే కోడి మీదికి నాలుగైదు కోళ్లు కాలు దువ్వుతాయి. అలాగని ఆ నాలుగైదు కోళ్లు కలిసి మెలిసి ఉంటాయా అంటే అదీ లేదు. ప్రధాన పోటీ మాత్రం... సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సల మధ్యే ఉంటుంది. బరిని విచ్చలవిడిగా ఏలుదామని వచ్చిన కిరణ్‌కు బొత్స పెను సవాల్‌గా మారారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దలను కదలడం, కిరణ్‌ను ఇరుకున పెట్టేలా గుడిసెపైకి ఎక్కి 'కొక్కొరొకో' అనడం బొత్సకు షరా మామూలే.
vestrana

అయితే... మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులతో బొత్సను డిఫెన్స్‌లో పడేయడంలో కిరణ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక 'కోడి' కొంత దారిన వచ్చిందని అనుకునేలోపే... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరింత పెద్ద కత్తులు కట్టుకుని దిగారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎంను 'అంశాల' వారీగా నిలదీసినట్లు కనిపించినప్పటికీ... పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిరూపించుకోవడమే రాజనర్సింహ అసలు లక్ష్యం.
అత్యంత ముఖ్యమైన తెలంగాణ అంశంపైనా పార్టీ వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రకటించడం, తరచూ ఢిల్లీకి వెళ్లి తన 'ప్రయత్నాలు' సాగించడం ద్వారా రాజనర్సింహ బరిలోని 'పెద్ద కోడి'కి చికాకు తెప్పిస్తున్నారు. బరిని ఏలేందుకు చేతిలో కర్చీఫ్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక చిరంజీవి, నాదెండ్ల మనోహర్ కూడా బరిలో ఉన్నప్పటికీ... కిరణ్‌తో హోరాహోరీగా మాత్రం పోరాడటంలేదు. 'టైమ్ వస్తే దూకుదాం' అని వేచి చూసే రకం! మంత్రి శంకర్రావు వంటి 'చిలిపి కోళ్లు' ఉండనే ఉన్నాయి. అయితే... కాంగ్రెస్ బరిలో ఎప్పుడు, ఏయే కోళ్లు కీచులాడుకుంటాయనేది ఎప్పుడూ ఆసక్తికరమే!
'దేశం' పుంజుల కోలాహలం
తెలుగుదేశం బరిలో రకరకాల కోళ్లు కొట్టుకుంటున్నాయి. టీడీపీ తెలంగాణ ఫోరం బరిలో ఒకవైపు ఎర్రబెల్లి దయాకర రావు, మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు! పైకి గాయాలు కనిపించకుండా కొట్టుకోవడమే వీరి 'ఫైట్' ప్రత్యేకత. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌గా తనకే గుర్తింపు రావాలన్నది ఎర్రబెల్లి ఆరాటం. కేసీఆర్‌పై గొంతు చించుకుని, మేడెక్కి అరిచేది తాను కాబట్టి, తనకే 'పెద్ద కోడి'గా పట్టం కట్టాలనేది మోత్కుపల్లి పోరాటం! అయితే... ఈ రెండు కోళ్లకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మోత్కుపల్లిలా గట్టిగా అరవలేకపోవడం ఎర్రబెల్లి బలహీనత. ఎర్రబెల్లి స్థాయిలో సమన్వయ నైపుణ్యం లేకపోవడం మోత్కుపల్లి వీక్‌నెస్.

తెలుగుదేశం 'ఫ్యామిలీ' బరిలోనూ కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. 'పెద్దకోడి' చంద్రబాబుకు తెలుగుదేశం బరిని మరో పదేళ్లపాటు ఏలగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ... 'నెక్ట్స్ ఎవరు?' అనే అంశంపై తేల్చుకునేందుకే పోరు సాగుతోంది. అయితే... ఈ పోరు ఇతర ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంతా అంతర్గతమే. ఈ పోరు బరిలో ఉన్నది ఎవరో కాదు! అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణలే! భవిష్యత్ రాజకీయాలపై వీరిమధ్య అపార్థాలునెలకొన్నాయి. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం బరిని సిద్ధం చేయాలని హరికృష్ణ ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.

ఇందుకు బాలకృష్ణ అడ్డొస్తాడన్నది ఆయన భయం. బాలయ్య తన అల్లుడైన నారా లోకేశ్‌నే ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే, ఇటీవల బాలయ్య 'కూత' ఈమధ్య జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ మధ్య హరికృష్ణ, బాలకృష్ణ పరస్పరం మాట్లాడుకోవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు చూడటమే మానేశారు.

టీఆర్ఎస్‌లో మామా అల్లుళ్ల సవాల్
టీఆర్ఎస్‌లోనూ తెలుగుదేశం తరహా కోళ్ల పందెమే జరుగుతోంది. అటు తెలంగాణ బరిలో, ఇటు టీఆర్ఎస్ పార్టీ బరిలో ఇప్పుడు కేసీఆర్ మాటకు ఎదురే లేదు. ఆయనే నెంబర్ వన్! 'నెంబర్ 2' కోడి ఎవరో తేల్చుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్య పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో హరీశ్‌వర్గం, కేటీఆర్ వర్గం అనే విభజన వచ్చింది.
http://images.blogs.hindustantimes.com/dabs-and-jabs/post/KCR.jpg
కేటీఆర్‌తో పోల్చితే... పార్టీని నడపడం, వ్యూహ రచనలు, సమన్వయ సాధనలో హరీశ్‌రావుకే ఎక్కువ మార్కులు పడతాయి. కానీ... పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అవకాశం ఎక్కువ సందర్భాల్లో కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్‌కే దక్కుతోంది. దీనిపై హరీశ్‌లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోకున్నప్పటికీ... గ్రూపులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య పార్టీలోని 'చిన్న కోళ్లు' నలిగిపోతుండటం మాత్రం నిజం.

'దేశం'పై జగన్ గురి

ఇదో చిత్రమైన బరి! ఈ పార్టీలో పెద్ద కోడి జగన్. అయితే... రాష్ట్ర రాజకీయ పోరు మాత్రం జగన్ పార్టీ చుట్టూనే తిరుగుతోంది. 2014లోపు జగన్‌ను బలహీనం చేస్తే తనకు ఎదురేలేదని చంద్రబాబు... బాబును దెబ్బతీస్తే అధికారం తనదేనని జగన్ భావిస్తున్నారు. అత్యంత చిత్రంగా... ఈ పోరులో అధికార కాంగ్రెస్ బరి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇరుప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడిందని జగన్, చంద్రబాబు భావిస్తుండటమే దీనికి కారణం. టీడీపీలోని ప్రధాన పందెం కోళ్లన్నీ జగన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాయి.

డేగ కళ్లు, వాడి కాళ్లు వేసుకుని... చిన్న అవకాశం దొరికినా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. జగన్ కూడా అంతే! తాను కేసుల్లో ఇరుక్కోవడంతో చంద్రబాబుపైనా తన తల్లితో కేసులు వేయించారు. విషయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లారు. తనపైనా, తన తండ్రిపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా, దాని మూలాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి... అధికార పార్టీ అస్త్ర సన్యాసం చేయగా, రెండు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

బహు బరులు... బడా కోళ్లు
కిరణ్ - జగన్, కిరణ్ - చంద్రబాబు, చంద్రబాబు - కేసీఆర్... ఇలా బడా కోళ్ల మధ్య భారీ పోరాటమే జరుగుతోంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో... ఇక తనకు తలుపులు మూసేసినట్లేనని జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేశారు. ఆ క్షణం నుంచి కిరణ్‌ను బలహీనం చేయడంపై దృష్టి సారించారు. పథకాలు మూలనపడ్డాయని ప్రతి సభలో తిట్టిపోయడం ఇందులో భాగమే. అవిశ్వాసం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావించినప్పటికీ... ఈ విషయంలో కిరణ్‌దే పైచేయి అయ్యింది. సామాజిక వర్గం, ప్రాంతం, ఎమ్మెల్యేల మధ్య తమ పట్టు నిలుపుకొనేందుకు కిరణ్, జగన్ మధ్య పోరు జరుగుతూనే ఉంది.

ఇక, తెలంగాణలో చంద్రబాబును బలహీన పరచాలని కేసీఆర్... టీఆర్ఎస్‌ను ఎంతోకొంత నిలువరించాలని చంద్రబాబు పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. టీడీపీని దెబ్బతీస్తే తెలంగాణలో 80 శాతం సీట్లు స్వీప్ చేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. ఆ చాన్స్ ఇవ్వకుండా... తెలంగాణలో కొన్ని, సీమాంధ్రలో భారీగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే... టీఆర్ఎస్, టీడీపీ కోళ్ల మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. 'నువ్వొకటంటే నేను నాలుగంటా' అన్నట్లుగా పోటా పోటీ ప్రెస్ మీట్లు, విమర్శలు! రాజకీయ బరిలో ఇదో రసవత్తర పోరు!

ఈ కోళ్లూ ఉన్నాయ్...

రాజకీయ కోళ్ల పందెంలో సీపీఎం, సీపీఐ బాగా వెనుకబడ్డాయి. 2004-09 మధ్య కాళ్లకు కత్తులు కట్టుకుని వీరోచితంగా పోరు సాగించిన సీపీఎం ఈ మధ్య కాలంలో అస్త్ర సన్యాసం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌లతో వెళ్లలేక... జగన్‌తో జట్టుకట్టే విషయంపై తేల్చుకోలేక... అత్యంత అయోమయంలో పడింది. సీపీఎంతో పోల్చితే సీపీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 'పుంజు కోడి' నారాయణ నోరే ఈ పార్టీకి కొండంత బలం. వారూ వీరని కాకుండా, ఎవ్వరిపైనైనా ఇంతేసి నోరు వేసుకుని పడటం, ఏదో ఒకస్థాయి పోరాటాలతో ఆయన పార్టీ ఉనికిని కాపాడటంలో విజయవంతం అయ్యారు. టీడీపీతో దోస్తీ సాగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక... బీజేపీ పరిస్థితి కూడా అయోమయంలోనే ఉంది. 'తెలంగాణ' నినాదాన్ని టీఆర్ఎస్ తర్వాత అత్యంత స్పష్టంగా భుజానికెత్తుకున్న ఈ పార్టీ సీమాంధ్రలో అడుగుపెట్టలేక పోతోంది. అలాగని... తెలంగాణలో దూసుకుపోతోందా.. అంటే అదీ లేదు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా టీఆర్ఎస్ నీడ నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే యాత్రల ద్వారా సొంత వ్యూహం రచిస్తోంది.

కొసమెరుపు: పార్టీల పందెం కోళ్లు ఎంతగా కొట్టుకుంటున్నా... ఎవరి బలం ఎంతో తేలేందుకు 2014 దాకా ఆగాల్సిందే. కానీ, బరి సిద్ధకాకముందే, పోటీని వీక్షించే ప్రజలు గుమికూడక ముందే కోళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మరో రెండేళ్లకు ఎవరి కత్తులు మొద్దు బారిపోతాయో, ఎవరివి వాడిగా ఉంటాయో వేచి చూడాలి మరి! 
http://www.thehindu.com/multimedia/dynamic/00503/16_P1_CARTOON_503599e.jpg

Friday, May 20, 2011

దగా సొమ్ముతో ధగ ధగ * కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్ * ఎన్నో ప్రశ్నలు

దగా సొమ్ముతో ధగ ధగ
కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్
వైఎస్ కుమారుడి విస్తృత ధన ప్రదర్శన 


 
దీనికి 55 ఏళ్ల పునాది
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ముంబైలో కట్టుకున్న 27 అంతస్తుల ఇల్లు ఇది. భారతదేశంలో అతి పెద్ద నివాస గృహాల్లో ఒకటైన ఈ ఇంటి పేరు ఆంటిలియా. 4,532 చదరపు మీటర్ల స్థలంలో 4 లక్షల చదరపు అడుగుల మేర నిర్మించిన ఈ భవనంలో 168 కార్ల పార్కింగ్‌కు అవసరమైన స్థలం, వాహనాల నిర్వహణకు ఒక పూర్తి అంతస్తు, 9 లిఫ్టులు, ఒక హెలిప్యాడ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫెసిలిటీ, 50 మంది కూర్చునే మినీ థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వేలాడే తోటలు వగైరా హంగులన్నీ ఉన్నాయి.


ఐదేళ్ల వైభోగమిది

కడప ఎంపీ వైఎస్ జగన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ ప్రాంతంలో కట్టుకుంటున్న ఇల్లు ఇది. 5,807 చదరపు మీటర్ల స్థలంలో 88,490 చదరపు అడుగుల మేర ఈ ఇంటిని కడుతున్నారు. ఇందులో 14 ఎస్కలేటర్లు, 10 లిఫ్టులు, ఒక మినీ థియేటర్, లైబ్రరీలు, స్క్వాష్ కోర్టు, జిమ్‌లు, 30 బెడ్‌రూమ్‌లు, ఒక్కోటీ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ సైజ్ ఉండే పలు బాత్‌రూంల... వంటి అనేక హంగులున్నాయి.

హైదరాబాద్, మే 20 : కడప ఎంపీ జగన్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోటస్‌పాండ్ ప్రాంతంలోని హుడా హైట్స్‌లో ఆరు ప్లాట్లను నాలుగు దొంగ కంపెనీల పేరిట కొనుగోలు చేసి, అందులో భారీ ఇంటిని నిర్మిస్తున్న విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది. క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, మార్వెల్ ఇన్‌ఫ్రా, హరీష్ ఇన్‌ఫ్రా, ఉటోపియా ఇన్‌ఫ్రా అనే నాలుగు కంపెనీల పేరిట 2, 3, 4, 6, 7, 8 నంబర్లు గల ప్లాట్లను కొనుగోలు చేసి, ఆ ఆరు ప్లాట్లను ఒకటిగా చేర్చి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.

ఈ ఇంటికి సంబంధించి తవ్వినకొద్దీ కొత్త కొత్త విషయాలు, కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. 2010 జులై 6వ తేదీన ఈ ఇంటి ప్లాన్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి అనుమతి పొందారు. ఈ స్థలం మొత్తం విస్తీర్ణం 5,807.19 చదరపు మీటర్లు. (6,945 చదరపు గజాలు) అంటే సుమారు ఎకరంన్నర. బంజారాహిల్స్‌లో ఎకరాన్నర స్థలం కొనడానికి మామూలు ధనవంతులు కూడా సాహసించలేరు.

అయితే, నాలుగు దొంగ కంపెనీలను ముందు పెట్టి, వాటి ద్వారా ఆరు ప్లాట్లను కొనిపించి, వాటన్నింటినీ ఏకం చేసి ఇంత పెద్ద స్థలంగా మార్చారు జగన్! క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్స్ పేరిట దీని ప్లాన్‌కు అనుమతి పొందారు. ఈ ప్లాట్లు పేరుకు నాలుగు కంపెనీలకు చెందినప్పటికీ, అదంతా జగన్ సొంత స్థలమేనని ఆయన సొంత పత్రిక 'సాక్షి'లో బాహాటంగా ప్రకటించుకున్నారు.

ఈ స్థలంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ 2010 జులై 6న అనుమతి ఇచ్చింది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 8,221.09 చదరపు మీటర్లు (88,490 చదరపు అడుగులు). ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం 1,400 చదరపు అడుగుల ఫ్లాట్‌లో నివసిస్తుందని అనుకుంటే అటువంటి 63 ఫ్లాట్లు కలిపితే జగన్ ఇల్లు అవుతుందన్న మాట. అంటే ఓ 250 మంది నివసించడానికి సరిపోయే ఇంట్లో జగన్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారన్న మాట! ఈ భవనం చుట్టూ కరెంటు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు భారీ ఎత్తున సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. దీనికి సెక్యూరిటీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు కోసమే అయిదు కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సమాచారం.

అక్కడే ఆఫీసు... చర్చి!

ఈ భవనంలో మహా తిరకాసు ఉంది. ఇది వివిధ కంపెనీలకు చెందిన స్థలం. కంపెనీలు గెస్ట్‌హౌస్‌లను, కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం. కానీ... ఇంటి నిర్మాణం కోసమంటూ అనుమతులు తీసుకోవడం విశేషం. అందులోనే మరో తిరకాసూ ఉంది. ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నప్పటికీ... ఈ భవనాన్ని చూస్తే అందులో పార్టీ కార్యాలయాన్ని కూడా కలిపి నిర్మిస్తున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవైపు ఇల్లు, మరోవైపు కార్యాలయం... ఈ విభజన స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఒకవైపు జగన్ కుటుంబం ఉండేందుకు ఇల్లును నిర్మిస్తుండగా... మరోవైపు చర్చిని, దాని వెనుక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇల్లు, చర్చి ఒక రోడ్డులో ఉంటే, కార్యాలయం వాటి వెనుకవైపు రోడ్డులో ఉంది. ఈ ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసింది 2010 జులై నెలలో! అప్పటికి జగన్ ఇంకా సొంత పార్టీ పెట్టలేదు. పెట్టే ఆలోచన ఉన్నట్లు కూడా చెప్పలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంతో జగన్ ఘర్షణ పడుతున్న సమయమది. జగన్ సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన చేసింది 2011 మార్చి 12న. అంటే పార్టీ ఏర్పాటుకు సుమారు పది నెలల ముందే ఆయన పార్టీ ఆఫీసుతో సహా అన్నింటికీ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు అర్థమవుతోంది.

అయితే, నివాస ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ఇంట్లో ఆఫీసు కాంప్లెక్స్‌ను నిర్మించినప్పటికీ దానిని పార్టీ కార్యాలయంగా ఉపయోగించబోమని, పార్టీ ఆఫీసు కోసం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని జగన్ సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంగా ఉపయోగించనప్పుడు ఇంట్లో అంత పెద్ద ఆఫీసు భవనాన్ని ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ భవనంపై జగన్ పార్టీ జెండాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

లోటస్ పాండ్ ప్రాంతంలో రోడ్లు అంత విశాలమైనవి కానందువల్ల అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చుట్టుపక్కల వారికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుందనేది మరో వాస్తవం. హైదరాబాద్‌లోని జగన్ స్థలం ముంబైలోని ముఖేశ్ అంబానీ స్థలం కంటే పెద్దది. అయితే ముఖేశ్ అంబానీ 27 అంతస్తుల్లో 4 లక్షల చదరపు అడుగుల ఇల్లు కట్టగా, జగన్ నాలుగు అంతస్తుల్లో 88 వేల అడుగులతోనే ఆగిపోయారు. జగన్ ఇల్లున్న ప్రాంతంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (15 మీటర్లు) కన్నా ఎక్కువ కట్టేందుకు అవకాశం లేకపోవడంతోనే 88 వేల అడుగులతోనే ఆగినట్లు అర్థం చేసుకోవచ్చు. లేదంటే జగన్ ఆయనను తలదన్ని ఆంధ్రా ముఖేశ్ అనిపించుకునేవారే!!

ఎన్నో ప్రశ్నలు

* లోటస్‌పాండ్ ప్రాంతంలో 5,900 గజాల స్థలంలో జగన్ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నట్లు 2010 సెప్టెంబర్ 10 నాటి సాక్షి పత్రికలో ప్రచురించారు. నిర్మాణంలో ఉన్న ఇంటి ఫొటో కూడా వేశారు. కానీ ఆ ఆస్తిని జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. ఎందుకని?
* జగన్ తన సొంతమని ప్రకటించుకున్న ఆ స్థలం, ఇల్లు వాస్తవానికి ఆయన పేరిట లేవు. జగన్ మాయా సామ్రాజ్యంలో భాగమైన నాలుగు దొంగ కంపెనీల పేరిట ఉన్నాయి. ఏమిటి ఇందులో మతలబు?
* ఆ కంపెనీల లావాదేవీలన్నీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిలో పెట్టుబడులు, రుణాలు అన్నీ ప్రశ్నార్థకమే!
* అది కేవలం ఇల్లేనని చెబుతూ కార్యాలయం మాదిరిగా ఎందుకు నిర్మిస్తున్నారు? భవిష్యత్తులో దానిని పూర్తిగా లేదా పాక్షికంగా పార్టీ కార్యాలయంగా ఉపయోగించే అవకాశం లేదా?
* సన్నని రోడ్లున్న ఆ ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?
* ఒకవేళ పార్టీ కార్యాలయాన్ని వేరే చోట ఏర్పాటు చేసేట్లయితే ఇంట్లో అంత పెద్ద కార్యాలయాన్ని ఎందుకు నిర్మించారు?

Sunday, April 24, 2011

కడపలో పంచతంత్రం

ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.

ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.

అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jagans 


       సానుకూలత
  • వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
  • గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
  • కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
  • అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
  • నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.

    ప్రతికూలత
  • గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
  • తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
  • ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
  • గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.

    డీఎల్‌ రవీంద్రరెడ్డి
  • సానుకూలతravin.(Maidukuru)
  • వివాదరహిత ముద్ర.
  • గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
  • ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
  • ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
  • అందుబాటులో ఉంటారన్న సానుకూలత.

    ప్రతికూలత

  • ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
  • సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
  • ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
  • బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
  • పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.

    మైసూరారెడ్డి
    mysooraeddyసానుకూలత
  • కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
  • వివాద రహిత ముద్ర.
  • హంగు, ఆర్భాటాలకు దూరం.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.

    ప్రతికూలత
  • కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
  • రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
  • సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
  • జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
  • పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.

    వైఎస్‌ విజయలక్ష్మి

    vijyasmaసానుకూలత
  • వైఎస్‌ భార్యగా సానుభూతి.
  • ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
  • భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
  • ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
  • వివాదరహిత మనస్తత్వం.

    ప్రతికూలత

  • ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
  • రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
  • స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
  • ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.

    వైఎస్‌ వివేకానందరెడ్డి
    YS-Vivekanadareddyసానుకూలత

  • అందరికీ అందుబాటులో ఉండే నైజం.
  • మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
  • సమస్యలపై పూర్తి అవగాహన.
  • ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
  • అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.

    ప్రతికూలత

  • వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
  • వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
  • ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
  • కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
  • ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.

    బీటెక్‌ రవి
    prsonసానుకూలత
  • రాజకీయాలకు కొత్త.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • యువకుడు కావడం.
  • నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
  • ధనబలం ఉండటం.

    ప్రతికూలత
  • సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
  • బలమైన వర్గం లేకపోవడం.
  • పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం.
  • కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.